
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించేందుకు భారత జట్టు సంసిద్ధమైంది. ఇండోనేసియా వేదికగా మొదలయ్యే ఆసియా మెగా టోర్నీకి మరో 17 రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో టీమిండియా తమ సన్నాహాకాలను ముమ్మరం చేసింది. బెంగళూరులోని భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) కేంద్రం వేదికగా బుధవారం నుంచి 11 రోజుల పాటు జరిగే ప్రత్యేక శిక్షణ శిబిరంలో భారత ఆటగాళ్లు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇటీవల 21 రోజుల పాటు జరిగిన బంగ్లాదేశ్, దక్షిణకొరియా, న్యూజిలాండ్ సిరీస్‌ల ద్వారా ఆటగాళ్లను పరీక్షించింది హాకీ ఇండియా. శిక్షణ క్యాంప్‌లో ఎంపిక చేసిన 18 మంది ఆటగాళ్లతో పాటు ఏడుగురు స్టాండ్‌బై ప్లేయర్లను తీసుకుంది. ఆసియా గేమ్స్ సన్నద్ధతపై భారత చీఫ్ కోచ్ హరేంద్రసింగ్ మీడియాతో మాట్లాడుతూ వరుస సిరీస్‌లు ముగిసిన వారం తర్వాత కఠోర శిక్షణ కోసం క్యాంప్‌ను ఏర్పాటు చేశాం. బంగ్లాదేశ్, దక్షిణకొరియా, న్యూజిలాండ్ బిజీ షెడ్యూల్ అనంతరం ఆటగాళ్లకు కచ్చితంగా విశ్రాంతినివ్వాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని సింగ్ అన్నాడు.
భారత్ 'పూల్ ఏ' లో ఎంపికై దక్షిణ కొరియా, జపాన్, శ్రీలంక, హాంగ్ కాంగ్, చైనా, ఇండోనేషియాలతో పాటు చేరింది. దీంతో వారం రోజుల విశ్రాంతి అనంతరం టీమిండియా ప్రాక్టీసును ముమ్మరం చేసినట్లు ఛీప్ కోచ్ హరేంద్ర సింగ్ వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. భారత్ క్వార్టర్స్ వరకూ వెళుతుందని అనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు. భువనేశ్వర్‌లో ముగిసిన హాకీ ప్రపంచ కప్ టోర్నీ మంచి అనుభవాన్ని నేర్పిందని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతమున్న ఆసియా క్రీడలకు ఎంపికైన హాకీ జట్టు వివరాలిలా ఉన్నాయి.
గోల్ కీపర్స్: పీఆర్ శ్రీజేశ్, క్రిషన్ బి పాతక్, సూరజ్ కర్కేరా
డిఫెండర్స్: హర్మన్ ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, వీరేంద్ర లక్రా, సురేందర్ కుమార్, రూపేందర్ పాల్ సింగ్, అమిత్ రోహిదాస్, కొతాజిత్ సింగ్ ఖాదంగబమ్, జర్మన్ ప్రీత్ సింగ్.
మిడ్ ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్, చింగ్ లెన్‌సనా సింగ్ కంగుజమ్, సిమ్రాన్‌జీత్ సింగ్, సర్దార్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, సుమిత్.
ఫార్వార్డ్స్: ఎస్వీ సునీల్, మన్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, దిల్‌ప్రీత్ సింగ్, సుమిత్ కుమార్, శైలానంద్ లక్రా.