
జకార్తా: ఆసియా గేమ్స్ హాకీలో భారత్ ఘన విజయం సాధించింది. పూల్ ఏలో భాగంగా ఆతిథ్య ఇండోనేషియాతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు 17-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగిన భారత్ జోరుకు ఇండోనేషియా జట్టు బేజారైంది. గెలుపోటములతో సంబంధం లేకుండా సెమీస్ చేరిన జట్లకు పతకాలు అందజేస్తారు. హాకీ టీమిండియాలో ముగ్గురు ప్లేయర్లు హ్యాట్రిక్ గోల్స్ చేశారు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
టీమిండియా ఆటగాళ్లు దిల్‌ప్రీత్ సింగ్ (6వ, 29వ, 32వ నిమిషాల్లో), సిమ్రాన్‌జీత్ సింగ్ (13వ, 38వ, 53వ నిమిషాల్లో), మన్‌దీప్ సింగ్ (29వ, 44వ, 49వ నిమిషాల్లో) గోల్‌లు హ్యాట్రిక్‌గా నమోదు చేశారు. మిగిలిన ఆటగాల్లు రూపేందర్ సింగ్ (1వ, 2వ నిమిషాల్లో), ఆకాశ్ దీప్ సింగ్ (10వ, 44వ నిమిషాల్లో), ఎస్‌వీ సునీల్ (25వ), వివేక్ సాగర్ (26వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ 31వ నిమిషంలో అమిత్ రోహిదాస్ (54వ నిమిషంలో) గోల్స్ చేసి 17 స్కోరు సాధించారు.
ప్రపంచంలోని టాప్ 5 స్థానంలో కొనసాగుతోన్న టీమిండియాతో పోటపడటం ఇండోనేషియాకు ఓ గొప్ప ఖ్యాతి అనే చెప్పాలి. ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో మాత్రమే ఇండోనేషియా ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హత పొందింది. ఈ క్రమంలో ఇండోనేషియా జట్టు మీదకు దాడి చేసిన భారత ప్లేయర్లు తాము సంధించిన 40 షాట్స్‌లో కేవలం 17 వరకూ మాత్రమే పాయింట్లుగా మార్చుకోగలిగారు. భారత పదింటిని స్కోర్డ్ ఫీల్డ్ గోల్స్‌గా నమోదు చేసుకోగా... ఆరింటిని పెనాల్టీ కార్నర్స్‌గా మిగిలిన ఒక్క గోల్ స్పాట్ గోల్‌గా సాధించింది.
11 పెనాల్టీ కార్నర్‌లను భారత ప్లేయర్లు ఆరు పెనాల్టీకార్నర్‌లుగా మార్చేందుకు తీవ్రంగానే శ్రమించారు. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఆటతీరులోని వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. కాగా, భారత్ తదుపరి మ్యాచ్ బుధవారం హాంకాంగ్‌తో తలపడనుంది.