Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా క్రీడల భారత హాకీ జట్టు, రూపేందర్.. ఆకాశ్ పునరాగమనం

Asian Games 2018: Indian Hockey team announced- Rupinder, Akash return, Sardar retains place

హైదరాబాద్: భారత జాతీయ క్రీడ హాకీ కోసం హాకీ ఇండియా తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందుకుగానూ.. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల కోసం హాకీ ఇండియా(హెచ్‌ఐ) సోమవారం 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. స్టార్ డ్రాగ్‌ఫ్లికర్ రూపిందర్‌పాల్‌సింగ్, అకాశ్‌దీప్‌సింగ్ పునరాగమనం చేయగా, సీనియర్ మిడ్‌ఫీల్డర్ సర్దార్‌సింగ్ జట్టులో చోటు నిలుపుకున్నాడు. వచ్చే నెల 18 నుంచి జకార్త వేదికగా మొదలయ్యే ఆసియా క్రీడల్లో బరిలోకి దిగే భారత హాకీ జట్టుకు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, చింగ్లేన్‌సన సింగ్ వైస్‌కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు.

ఇటీవల హాకీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టునే దాదాపు కొనసాగిస్తూ జర్మాన్‌ప్రీత్‌సింగ్ స్థానంలో రూపిందర్, గాయపడ్డ రమణ్‌దీప్‌సింగ్‌కు బదులుగా ఆకాశ్‌దీప్‌సింగ్‌కు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. సర్దార్‌సింగ్, మన్‌ప్రీత్‌సింగ్, సిమర్‌జీత్‌సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్‌తో మిడ్‌ఫీల్డ్ పటిష్ఠంగా కనిపిస్తుంది.

ఆకాశ్‌దీప్‌సింగ్, ఎస్‌వీ సునీల్, మన్‌దీప్‌సింగ్, లలిత్‌కుమార్, దిల్‌ప్రీత్‌సింగ్ ఫార్వర్డ్ దళాన్ని నడిపించనున్నారు. కుర్రాళ్లు, అనుభవజ్ఞల కలయికతో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఇటీవలి టోర్నీల్లో మెరుగ్గా రాణించిన ఆటగాళ్లు జట్టులో చోటు నిలుపుకున్నారు. కానీ మోకాలి గాయంతో రమణ్‌దీప్‌సింగ్ ఆసియా క్రీడలకు దూరం కావడం ఒకింత లోటుగా ఉంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలువడం ద్వారా టోక్యో(2020) ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనుకుంటున్నాం అని భారత చీఫ్ కోచ్ హరేంద్రసింగ్ అన్నాడు.

భారత హాకీ జట్టు:
శ్రీజేశ్(కెప్టెన్), క్రిషన్ పాథక్, హర్మన్‌ప్రీత్‌సింగ్, వరుణ్‌కుమార్, బిరేంద్ర లక్రా, సురేందర్ కుమార్, రూపిందర్‌పాల్, అమిత్ రోహిదాస్, మన్‌ప్రీత్‌సింగ్, చింగ్లేన్‌సనసింగ్, సిమ్రాన్‌జీత్‌సింగ్, సర్దార్‌సింగ్, వివేక్‌సాగర్, సునీల్, మణ్‌దీప్‌సింగ్, ఆకాశ్‌దీప్‌సింగ్, లలిత్‌కుమార్, దిల్‌ప్రీత్‌సింగ్.

Story first published: Tuesday, July 10, 2018, 10:41 [IST]
Other articles published on Jul 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+