ఆసియా గేమ్స్: హాకీ జట్టు కాంస్యం నెగ్గడంపై కెప్టెన్ ఆవేదన

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరిగిన 18వ ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించలేకపోయామన్న బాధకు, అక్కడ సాధించిన కాంస్యమో, పాకిస్తాన్‌పై విజయమో విరుగుడు కాదని భారత హాకీ కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ పేర్కొన్నాడు. మలేసియాతో 60 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో రెండు జట్లు 2-2తో సమంగా నిలవడంతో షూటాఫ్ అనివార్యమైంది.
షూటాఫ్‌లోనూ రెండు జట్లు అత్యంత ఒత్తిడి మధ్య ఆడాయి. అయితే ఆటగాళ్లు చక్కగా ఆడటంతో మళ్లీ షూటప్‌లో స్కోర్లు 5-5తో సమం అయ్యాయి. ఆ తర్వాత జరిగిన సడన్‌డెత్‌లో రెండు జట్లు తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో స్కోరు 6-6 అయింది. మలేసియా రెండో అవకాశంలో గోల్ చేయగా భారత్ తరఫున ఎస్వీ సునీల్ ఒత్తిడిలో గోల్ చేయలేకపోయాడు.

ఆసియా గేమ్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా
దీంతో 6-7తో టీమిండియా ఓటమిపాలైంది. ఆసియా గేమ్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు లీగ్ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి 76 గోల్స్‌తో పేవరేట్‌గా స్వర్ణంపై అంచనాలు పెంచింది. స్వర్ణం ఖాయమనుకున్న జట్టుకు సెమీఫైనల్స్‌లో ఎదురుదెబ్బ తగలడంతో కెప్టెన్ శ్రీజేష్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.
మా ఆవేదనలో ఎలాంటి సందేహం లేదు
ఈ సందర్భంగా శ్రీజేష్ మాట్లాడుతూ "మా ఆవేదనలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాదిలోనే ఆసియా క్రీడల్లో మా ప్రదర్శన అత్యద్భుతం. అయినా ఓటమి ఎదురవ్వడంతో ఆటగాళ్లంతా షాక్ తిన్నాం. పాక్‌పై విజయంతో సాధించిన పతకం కేవలం కన్సొలేషన్ కాంస్యమే. అది మా బాధను ఏమాత్రం మాన్పలేదు" అని అన్నాడు.
2020 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించలేకపోయిన భారత్
ఈ ఓటమితో భారత్ 2020 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించలేకపోయింది. ఎనిమిదేళ్ల క్రితం గ్వాంఝౌలోనూ మలేషియానే టీమిండియాను ఓడించడం గమనార్హం. దీనిపై శ్రీజేష్ స్పందిస్తూ "ఒలింపిక్స్‌లో అర్హత సాధించడానికి ఆసియా గేమ్స్ ఒక అవకాశం మాత్రమే. అదే చివరిది కాదు" అని శ్రీజేష్ అన్నాడు.
అర్హత సాధించడానికి చాలా అవకాశాలు
"అర్హత సాధించడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. వాటిని సాధించగలమన్న నమ్మకం నా జట్టుకు బలంగా ఉంది. ఆసియా గేమ్స్ నుంచే ఒలింపిక్‌కు అర్హత సాధించే సామర్థ్యమున్న జట్లలో భారత్ ఒకటి. కానీ సాధించలేకపోయాం" అని శ్రీజేష్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications