న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్ భారత హాకీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్ లో దక్షిణ కొరియాపై 1-0 తేడాతో భారత్ విజయం సాధించింది.
2002 ఆసియా క్రీడల తరువాత భారత్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. భారత హాకీ జట్టు బంగారు పతకం సాధించి 16 ఏళ్లు దాటింది.

1998లో ధనరాజ్ పిళ్లై కెప్టెన్స్లీలో స్వర్ణం సాధించిన భారత్ ఇప్పటి వరకూ ఆ పతకాన్ని దక్కించుకోలేదు. భారత్, దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరితే 2016 రియో ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధిస్తుంది.

మంగళవారం జరిగిన సెమీ పైనల్‌లో పూజారాణి ఓటమి పాలవ్వడంతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 69-75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో జరిగిన పోరులో చైనా క్రీడా కారిణి లీ కైన్ చేతిలో ఓడిపోయింది.
సెకండ్ రౌండ్‌లో ఆకట్టుకున్న పూజారాణి.. మూడో రౌండ్‌లో పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. సెయిలింగ్ విభాగంలో భారత్ కాంస్యం సాధించింది. మహిళల డింఘీ ఈవెంట్‌లో వర్ష - ఐశ్వర్య జోడీ ఈ విజయాన్ని సాధించారు. మంగళవారం జరిగిన ఆసియా గేమ్స్‌లో డిస్కస్ త్రో విభాగంలో వికాస్ గౌడ రజత పతకం సాధించాడు. దీంతో భారత్ ఖాతలో ఎనిమిదో రజతం వచ్చి చేరింది.