Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఛాంపియన్స్‌ ట్రోఫీ: భారత జోరుకి కళ్లెం వేసిస మలేసియా

Asian Champions Trophy: India remain unbeaten as defending champs held by Malaysia

హైదరాబాద్: మస్కట్ వేదికగా జరుగుతున్న ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జోరుకు మలేసియా కళ్లెం వేసింది. ఈ టోర్నీలో వరుసగా మూడు భారీ విజయాలు సాధించిన భారత్‌.. మంగళవారం మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందని ఆశించిన భారత అభిమానులకు నిరాశే మిగిలింది.

ఈ మ్యాచ్‌లో మలేసియా అద్భుత ప్రదర్శన చేసింది. ఇరు జట్లూ డిఫెన్స్‌లో బలంగా ఉండటంతో గోల్స్‌ నమోదు కాలేదు. నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్‌ చేయలేకపోవడంతో మ్యాచ్‌ 0-0తో 'డ్రా'గా ముగిసింది. భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

నాలుగేసి లీగ్‌ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్, మలేసియా జట్లు మూడు విజయాలు సాధించి ఒక 'డ్రా' నమోదు చేశాయి. ఇండియాతో పాటు మలేసియా కూడా సెమీస్‌ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇరుజట్లు 10 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. టోర్నీలో భాగంగా బుధవారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్‌ తలపడుతుంది.

Story first published: Wednesday, October 24, 2018, 13:16 [IST]
Other articles published on Oct 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+