
హైదరాబాద్: మస్కట్ వేదికగా జరుగుతున్న ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఫైనల్లో ప్రవేశించింది. శనివారం రాత్రి జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 3-2 స్కోరుతో జపాన్‌ను ఓడించి నాలుగోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (19వ నిమిషంలో), చింగ్లేన్‌సనా (44వ నిమిషంలో), దిల్‌ప్రీత్‌సింగ్ (55వ నిమిషంలో) గోల్స్ చేయగా... జపాన్ తరఫున వకురి (22వ నిమిషంలో), జెన్‌దాన (56వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్లో పాకిస్థాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
అంతకముందు భారత్ 2011, 2016లలో ఫైనల్లో పాక్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. కాగా, తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్ 'షూటౌట్'లో 3--1తో మలేసియాపై విజయం సాధించింది.
ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్
ఇండియా Vs పాకిస్థాన్
ఆదివారం రాత్రి గం. 10.40 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం