న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలేషియా ఓటమి: ఆసియా కప్‌ హాకీ విజేతగా భారత్‌

By Nageshwara Rao

హైదరాబాద్: ఆసియా కప్ హాకీ టోర్నీలో విజేతగా భారత్ అవతరించింది. బంగ్లా రాజధాని ఢాకాలో ఆదివారం జరిగిన ఫైనల్లో మలేసియాపై 2-1 గోల్స్‌ తేడాతో భారత్ విజయం సాధించింది. తాజా విజయంతో భారత్ మూడోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది.

అంతకముందు శనివారం జరిగిన సూపర్ ఫోర్‌ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 4-0తేడాతో చిత్తు చేసిన భారత్‌.. ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో మ్యాచ్ ఆరంభంలోనే రమణదీప్ సింగ్ (3వ నిమిషంలో) తొలి గోల్ చేసి భారత్‌ని 1-0తో ఆధిక్యంలో నిలిపాడు.

 India Are Champions Of Asia for the Third Time

ఆ తర్వాత 29వ నిమిషంలో మరో గోల్‌తో లలిత్ ఉపాధ్యాయ దాన్ని రెట్టింపు చేశాడు. అనంతరం భారత్ ఆధిక్యాన్ని తగ్గించేందుకు మలేషియా చేసిన విశ్వప్రయత్నాలు ఫలించలేదు. చివరకు 50వ నిమిషంలో ఒక గోల్‌ చేసి ఆధిక్యాన్ని 2-1కి మలేసియా తగ్గించగలిగింది.

ఆ తర్వాత మాత్రం ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారత్ రక్షణాత్మక ధోరణిలో మ్యాచ్ ఆడి 2-1తో మ్యాచ్‌లో విజయం సాధించి హీరో ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:16 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X