మార్గోవా: ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లలేకపోయామని ఎఫ్ సి గోవా జట్టు చీఫ్ కోచ్ జికో అంగీకరించాడు. 2016 సీజన్‌లో అట్లెటికో డి కోల్‌కతా జట్టుతో గురువారం రాత్రి ఫాటోర్డాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గోవా జట్టు 2 - 1 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది.
సందర్శక జట్టు జువాన్ బెలెంకోసో 28వ నిమిషంలో సాధించిన గోల్‌ను 80వ నిమిషంలో మందార్ రావు దేశాయ్ సాధించిన గోల్.. స్కోర్ సమంచేసింది. తర్వాత ఇంజ్యూరీ టైంలో కోల్‌కతా ప్లేయర్ స్టీఫెన్ పియర్సన్ సాధించిన గోల్ పాయింట్‌తో గోవా సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి.

కానీ గోవా కోచ్ జికో తన డిజప్పాయింట్‌మెంట్‌ను కప్పిపెట్టుకోలేకపోయాడు. 'నేను మొదట ఎఫ్ సి గోవా జట్టు అభిమానులకు క్షమాపణ చెప్తున్నా. కానీ మేం చాలా కష్టపడి మెరుగైన ఫలితం సాధించాలని భావించాం. కానీ మా అవకాశాలపై పరిస్థితులు నీళ్లు చల్లాయి. గతంలో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో సమర్థంగా ఆడేవాళ్లం. నాలుగైదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వడం ఇబ్బందికరంగా మారింది. మా జట్టు ఇతర జట్లకంటే నాసిరకం కాదు పలు మ్యాచ్‌లలో వచ్చి బోలెడు అవకాశాలు కోల్పోవడం సిగ్గనిపిస్తున్నది. ప్రతి ఒక్కరూ హీరోగా ఉండాలనే కోరుకుంటారు. రిచర్ల్యైసన్ మాత్రమే ముగ్గురు, నలుగురు ప్లేయర్లకు వ్యతిరేకంగా పోరాడేవారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బాగా ఆడలేకపోయాం. సెకండాఫ్‌లో పరిస్థితులు మారిపోయాయి. మేం స్కోర్ సమంచేసిన తర్వాత సరిగ్గా వ్యవస్థీక్రుతం కాలేదు. ఫస్టాఫ్‌లో వచ్చిన అవకాశాల కంటే మెరుగ్గా ఆడాం. సెకండాఫ్‌లో పలు చాన్స్‌లు వచ్చినా అందుకోలేకపోయాం' జికో వ్యాఖ్యానించాడు.
ఒకవేళ తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలుపొందితే సెమీ ఫైనల్స్‌లో గోవా అడుగు పెట్టేందుకు అవకాశాలు లేకపోలేదన్నాడు. అయితే అట్లెటికో డి కోల్ కతాతో ఓటమి తర్వాత మాత్రం సెమీ ఫైనల్స్ దశకు క్వాలిఫయింగ్ అవకాశాలు సన్నగిల్లాయని జికో అంగీకరించాడు.
గోవా తదుపరి ఢిల్లీ డైనమోస్ ఎఫ్ సి, డిఫెండింగ్ చాంపియన్లు చెన్నైయిన్ మ్యాచ్‌ల్లో అనుసరించే వ్యూహాన్ని ఖరారుచేస్తామని తెలిపాడు. సెమీస్ బరిలో అవకాశాలు లేకపోయినా గట్టిగా ఢీ కొంటామన్నాడు. 'మేం మా అభిమానులను, జెర్సీని గౌరవించాలి. మా టీం ఆడిన తీరుపట్ల నేను చాలా డిజప్పాయింటయ్యా. డెంజిల్ ఫ్రాన్స్ కో మినహా ప్రతి ప్లేయర్‌కు అవకాశం కల్పించా. మాకు మళ్లీ మూడు రోజుల సమయం లభించింది. మళ్లీ మేం పికప్ అందుకొనేందుకు అవకాశం చిక్కింది' అని చెప్పాడు.
విషాదంలో జాఫ్ఫ్రీ
అట్లెటికో డీ కోల్‌కతాపై జరిగిన మ్యాచ్‌లో గోవా ఓటమితో విషాదంలో మునిగిపోయాడు. ఇది తమ జట్టు ఏడో పరాజయం అని తెలిపాడు. గోల్స్ సాధించేందుకు రెండు షాట్లు కొట్టిన ప్రయోజనం లేకపోయింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడంతో సెమీస్ ఆశలు కోల్పోయామన్నాడు. రెండు కీ పాస్ లు అందజేసినా, అందులో ఒకటి విజయవంతమైనా గోల్ వరకు వెళ్లలేకపోయిందన్నాడు.