Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కత్తాతో డ్రా: గెలుపుతో సమానమన్న జంబ్రొట్టా

న్యూఢిల్లీ: అట్లెటికో డీ కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌ డ్రా ముగించడం ఒకరకంగా గెలుపుతో సమానమేనని ఢిల్లీ డైనమోస్ సారధి జియాంలుకా జంబ్రొట్టా వ్యాఖ్యానించాడు. సుమారు 20 వేల మంది అభిమానుల మధ్య ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌ 17వ నిమిషంలో విజిటర్స్ జట్టుకు గోల్ సమర్పించుకున్నా.. చివర్లో చెలరేగిపోయింది ఢిల్లీ డైనమోస్.

అయితే పదేపదే అటాకింగ్‌కు దిగిన బాదారా బాద్జీ రెండుసార్లు ఎల్లోకార్డు చూపడంతో మ్యాచ్ నుంచి వైదొలగడంతో ఢిల్లీ పరిస్థితి ఫస్టాఫ్ కు ముందే దారుణంగా మారింది. కానీ సెకండాఫ్‌లో మాత్రం తెలివిగా ఆడుతూ గోల్స్ సాధిస్తూ ముందుకు సాగారు. తొలుత మిలాన్ సింగ్, తర్వాత సారధి ఫ్లోరెంట్ మాలౌదా చెరో గోల్ సాధించి జట్టును 10 మ్యాచ్‌లలో 17 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలబెట్టారు.

మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జంబ్రొట్టా 'నేను మా జట్టు మూడు పాయింట్లు కోల్పోయిందని భావించడం లేదు. మేం ఒక పాయింట్ సాధించుకున్నా,మాకు మా పరిస్థితిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఎంతో క్లిష్టతరంగా మారిన ఈ మ్యాచ్ సెకండాఫ్‌లో 4 - 4 - 1 వ్యూహంతో బరిలోకి దిగాం. నేను ఈ మ్యాచ్ ఫలితంతో సంతోషంగా ఉన్నాను' అని చెప్పాడు.

కోల్‌కతాలో ఢిల్లీ ఓటమి

కోల్‌కతాలో ఢిల్లీ ఓటమి

ఈ సీజన్లో తొలుత కోల్ కతాలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి పాలైంది. ఈ టోర్నీలో ఢిల్లీ ఓటమి పాలైన మ్యాచ్ కూడా ఇదొక్కటే. ఫస్టాఫ్ లో తాము ఒత్తిడికి గురైన మాట వాస్తవమేనని జంబ్రొట్టా అంగీకరించాడు. కొన్నిసార్లు పిచ్ పై లభించిన మొత్తం అవకాశాన్ని కూడా వినియోగించుకోలేదన్నాడు. ఇయాన్ హుమ్ గోల్ తో కోల్ కతా లీడ్ సాధించిన తర్వాత తొలిసారి మార్సిలిన్హో పెనాల్టీ గోల్ సాధించడంలో విఫలమయ్యాడు. పెనాల్టీ పాయింట్ సాధించడంపై మార్సిలిన్హోకు విశ్వాసం ఎక్కువ, తనకు ఇద్దరిలో ఎవరు పెనాల్టీ గోల్ సాధించినా సంతోషమేనన్నాడు. ఢిల్లీ జట్టు తదుపరి పుణె సిటీతో ఈ నెల 18న తలపడనున్నది. పుణెతో జరిగే మ్యాచ్ కు రిచర్డ్ గాడ్జె, చింగ్లెంసానా సింగ్ ఫిట్‌గా అందుబాటులో ఉంటాడని భావిస్తున్నారు.

 ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యాం: మొలీనా

ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యాం: మొలీనా

సెకండాఫ్‌లో ఢిల్లీ డైనమోస్ జట్టుపై ఒత్తిడి పెంచడంలో తమ కుర్రాళ్లు విఫలమయ్యామని అట్లెటికో డీ కోల్‌కతా కోచ్ జోస్ మొలీనా వ్యాఖ్యానించాడు. ఫస్టాఫ్‌లో ఢిల్లీ ప్లేయర్ బాదారా బాద్జీని రెండుసార్ల ఎల్లోకార్డుతో బెంచ్ కు పంపిన తర్వాత కూడా లీడ్ సాధించలేకపోవడం వల్లే తాము మ్యాచ్ డ్రాగా ముగించాల్సి వచ్చిందని తెలిపారు. ఫస్టాఫ్‌లో తమ ప్లేయర్లు బెటర్ గా ఆడారన్నాడు. తమ కుర్రాళ్లపై పలుసార్లు రిఫరీ ఫౌల్స్ ఆదేశాలిచ్చాడని, ఢిల్లీ కుర్రాళ్లు తమను తాకినా పట్టించుకోలేదన్నాడు. అదే ఒత్తిడితో కూడిన ఆట ఆడేందుకు ఢిల్లీని అనుమతించడం వల్లే మిలాన్ సింగ్, ఫ్లోరెంట్ మాలౌదా గోల్స్ చేయగలిగారన్నాడు.

గాయం పాలైన సమీగ్ దౌటీ

గాయం పాలైన సమీగ్ దౌటీ

మాలౌదా రెండో గోల్ చేసిన తర్వాత బ్యాక్ లైన్‌పై కోల్ కతా డిఫెన్స్ ను అడ్డుకున్నాడు. చుట్టూ డిఫెండర్లు ఉంటే గోల్ ఎలా చేయాలని ప్రశ్నించాడు. ఇయాన్ హుమ్ కు అసిస్టెంట్ గా వచ్చిన సమీగ్ దౌటీ గాయంతో బాధపడుతున్నాడన్నాడు. అతడికి పెద్ద దెబ్బ తగిలిందని తాను భావించడం లేదన్నాడు. కోల్ కతా జట్టు తదుపరి గురువారం నాడు నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుతో తలపడనున్నది. ఇయాన్ హుమ్ తొలుత గోల్ సాధించి లీడ్ లోకి తీసుకెళ్లినా పది మంది కుర్రాళ్ల ఢిల్లీని నిలువరించలేకపోయినందుకు డిజప్పాయింట్ అయ్యాడు. మూడు కీలక పాస్ లు లభించినా సద్వినియోగంచేసుకోలేక పోయామన్నాడు. రిఫరీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని ప్రశ్నార్థకంగా ఉన్నాయని తెలిపాడు. ఢిల్లీ జట్టు చాలా మంచిదని, దానిపైనే తాము తొలి హాఫ్ లో పట్టు సాదించామని హుమ్ వ్యాఖ్యానించాడు.

మిలాన్, మాలోదా ఫుల్ హ్యాపీ

మిలాన్, మాలోదా ఫుల్ హ్యాపీ

ఎటికెతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగించడంలో కీలకపాత్ర పోషించినందుకు ఢిల్లీ సారధి ఫ్లోరెంట్ మాలౌదా, తొలి గోల్ తో స్కోర్ సమంచేసిన మిలాన్ సింగ్ పూర్తి సంతోషంలో మునిగిపోయారు. ఫ్లోరెంట్ మాలౌదా స్పందిస్తూ మ్యాచ్ ప్రారంభంలోనే ఒక ప్లేయర్ ను దూరంచేసుకోవాల్సి రావడంతో మ్యాచ్ గెలుపొందడం కష్టంగా మారింది. తాము అత్యంత పటిష్టమైన జట్టుతో ఆడినప్పుడు మ్యాచ్ డ్రాగా ముగించడం కూడా మంచి ఫలితమేనన్నాడు. తాము మెరుగైన ఆటతీరు ప్రదర్శించాలని తమ కోచ్ హితబోధ చేశాడని మిలాన్ సింగ్ అన్నాడు. సెకండాఫ్ లో చాలా ముఖ్యమైన ఆట ఆడామన్నాడు. గోల్స్ సాధించడం గురించి తమ సారధి ఫ్లోరెంట్ మాలౌదా నుంచే నేర్చుకున్నాననడంతో ఇద్దరూ ఫక్కున నవ్వేశారు. ప్రతి మ్యాచ్ లోనూ ఒకేలా ఆడతామని, అయితే జట్టుకో స్టయిల్ ఉంటుందని మాలౌదా అంగీకరించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+