న్యూఢిల్లీ: అనుభవమే మరోసారి కేరళ బ్లాక్ బస్టర్స్, చాంపియన్స్ అట్లెటికో డి కోల్ కతా జట్లను ఈ ఏడాది ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫైనల్స్ దరికి చేర్చింది. రెండు జట్లలోనూ అనుభవం గల ప్లేయర్లకు కొదవలేదు. ఇక యువరక్తం ఎక్కువగా ఉన్న టీంలు బాగానే ఆడినా అనుభవజ్నుల ముందు నిలబడలేకపోయాయి.
ప్రత్యేకించి నార్త్ఈస్ట్ యునైటెడ్ సెమీ ఫైనల్స్‌దశకు, ఢిల్లీ డైనమోస్ జట్టు ఫైనల్స్‌కు కొద్దిలో అవకాశం మిస్సయ్యాయి. ఫైనల్స్‌లో షూటౌట్ల ద్వారా 4 - 3 గోల్స్ తేడాతో కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుపై విజయం సాధించి రికార్డు నెలకొల్పిన అట్లెటికో డి కోల్‌కతాలో ప్లేయర్ల సగటు వయస్సు అత్యధికంగా 29 ఏళ్ల రెండు నెలలు.
ఇక దేశీయ ఆటగాళ్లు 26 ఏళ్ల నాలుగు నెలలే. ఎటికె హెడ్ కోచ్ జోస్ మొలీనా లీగ్ లోని మిగతా కోచ్‌ల కంటే పెద్దవాడు, అనుభవం కల వాడు. ఇక మొలీనా ఏరికోరి ఎంచుకున్న సారధి హెల్డర్ పొస్టిగ, స్కిప్పర్ బొర్జా ఫెర్నాండెజ్, ఈ ఏడాది టోర్నీ టాప్ స్కోరర్ ఇయాన్ హుమ్ వంటి ప్లేయర్లంతా తమదైన శైలిలో చెలరేగిపోయారు.

తమదంటూ మెరుగైన ప్రతిభను కనబరిచారు. కుర్రకారు కూడా బాగానే ఆడారు. లాల్రిండికా రాల్టే మొదలు అబినాశ్ రుడియాస్ నుంచి ప్రీతం కొట్టల్ వరకు ఎటికె కుర్రాళ్లంతా లీగ్‌లో తమదైన మార్కు ప్రతిభ చూపారు.
ఎటికె తర్వాత అనుభవజ్నుల టీం ఎఫ్ సి పుణె సిటీలో కుర్రాళ్ల సగటు వయస్సు 29 ఏళ్ల ఒక నెల.
దేశీయ ఆటగాళ్లు 27 ఏళ్ల 8 నెలలు. గమ్మత్తేమిటంటే పుణె సారథి (లివర్ పూల్, మాలియన్ మాజీ మిడ్ ఫీల్డర్) మహ్మద్ సిస్సోకో (31) మిగతా జట్ల కెప్టెన్ల కంటే యువకుడు. తర్వాతీ జాబితాలో ఎఫ్ సి గోవా, కేరళ బ్లాక్ బస్టర్స్ ఎఫ్ సి జట్లు వస్తాయి. రెండు జట్లలోనూ సగటున 29 ఏళ్ల నుంచి 28 ఏళ్ల 8 నెలల వయస్సు గల ప్లేయర్లు ఉన్నారు.
గోవాలో ప్రతిభావంతులైన ఇండియన్ ప్లేయర్స్ యావరేజీ ఏజ్ 28 ఏళ్ల ఏడు నెలలు. మూడో ఎడిషన్ లో చివరి స్థానంలో స్థిరపడిన ఎఫ్ సి గోవా విదేశీ ఆటగాళ్ల సగటు వయస్సు 32 ఏళ్ల 10 నెలలు ఉంటే.. కేరళ కుర్రాళ్ల వయస్సు నాలుగేళ్లు తక్కువ. కేరళ యువరక్తం, అనుభవం గల ప్లేయర్ల మేలు కలయికగా ఉన్నది.
సారథి అరోన్ హుగెస్, సెడ్రిక్ హెంగ్బార్ట్‌లతోపాటు గోల్ కీపర్ సందీప్ నాండీ జట్టును ముందుకు నడిపించారు. డిఫెండర్ సందేశ్ జిగ్నాస్, మిడ్ ఫీల్డర్ వినీత్ రాయి, స్ట్రయికర్ థోంగ్ ఖోసైం హావో కిప్, ప్లే మేకర్ జోస్ కురియస్ కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లనే చెప్పాలి.
ఈ ఏడాది పూర్తిగా వెనుకకు నెట్టేయబడిన చెన్నయిన్ ఎఫ్ సి జట్లలో కుర్రాళ్ల సగటు వయస్సు 28 ఏళ్లలోపే. రెండు జట్లలోనూ భారతీయుల సగటు వయస్సు 26 ఏళ్లలోపు వారే. ప్రస్తుత సీజన్‌లో తొలిసారి సెమీ ఫైనల్స్ వరకూ దూసుకెళ్లిన ముంబై సిటీ ఎఫ్ సి జట్టు సారథి డియాగో ఫోర్లాన్ ఈ ఏడాది చెలరేగిపోయాడు.
టోర్నీ అంతటా విస్తరించాడు. ఐదు గోల్స్, మూడు అసిస్టెన్స్‌లతో అలరించాడు. రోమనియన్ సెంటర్ బ్యాక్ ప్లేయర్ లుసియాన్ గోవాన్ కూడా ముంబై జట్టు తొమ్మిది క్లీన్ షీట్లు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ముంబై యంగ్‌స్టర్లు అల్బినో గోమ్స్ తదితరులు గోల్స్ సాధించడానికి ప్రయత్నించాడు.
ఈ సీజన్‌లో గోల్డెన్ గ్లోవ్ గెలుచుకున్న అమరిందర్ సింగ్ సెకండాఫ్ లో జరిగిన ఆరు మ్యాచ్ లలో ఐదు క్లీన్ షీట్లు సాధించాడు. ఫ్లయింగ్ ఢిల్లీ డైనమోస్ జట్టులో కుర్రాళ్లకు కొదవలేదు. చింగ్లెంసానా సింగ్, సోరం పౌరెయి, కియాన్ లూయిస్, మిలాన్ సింగ్ తదితరుల సగటు వయస్సు 26 ఏళ్లు.
టోర్నీలో అత్యధికంగా యువకులు గల టీం ఢిల్లీ డైనమోసే. ఈ ఏడాది ఇటు కుర్రకారు, అటు సీనియర్లు కలగలిసి సింహాల్లా చెలరేగిపోయారు. సారథి ఫ్లోరెంట్ మాలౌదా ప్రస్తుత సీజన్‌లో జట్టుకు అత్యధిక సేవలందించిన ప్లేయర్‌గా నిలిచాడు. త్యధికంగా సహచర ప్లేయర్లకు 5 అసిస్టెన్స్‌లో కీలకంగా వ్యవహరించాడు.
అందువల్లే హీరో ఆఫ్ ది హీరో అవార్డును మాలౌదా గెలుచుకున్నాడంటే ఆశ్చర్యమేముంది మరి. ఢిల్లీ కుర్రాళ్లలో కియాన్ లూయిస్ నాలుగు గోల్స్, రెండు అసిస్టెన్స్‌లతో ఫ్లాగ్ బేరర్‌గా నిలిస్తే, రిచర్డ్ గడ్జె సైతం స్ఫూర్తిదాయక ఆటగాడిగా నిలిచాడు. గోల్డెన్ బూట్ గెలుచుకున్న మార్సిలిన్హో (10 గోల్స్) తర్వాతీ స్థానంలో నిలిచాడు.
అత్యధికంగా కుర్రకారు గల టీం నార్త్ఈస్ట్ యునైటెడ్. సగటున 26 ఏళ్లు. దేశీయ ఆటగాళ్ల వయస్సు చాలా తక్కువ. విదేశీ ప్లేయర్లు 29 ఏళ్ల వయస్కులు.