
హైదరాబాద్: మైదానంలో నిత్యం పరుగులు పెట్టే వారు ఎంత ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడూ గెలవాలనే కసితో పోరాడే ఆటగాళ్లు బోలెడంత తెగువతో పోరాడుతారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటల్లో ఒకటైన ఫుట్‌బాల్ ఆటగాళ్ల జీతాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అన్ని ఉన్నా, అదేదో లేదన్నట్లు ఈ యువ క్రీడాకారుడు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడాల్సి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవాకు సంబంధించిన స్పోర్టింగ్ క్లబ్ డె గోవా ఆటగాడైన అవెరిస్థో ఫెర్నాండేజ్(21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిసెంబరు 31 అర్థరాత్రి ఇంట్లోంచి బయటికి వెళ్లాడు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పార్టీకి వెళ్లిన ఫెర్నాండేజ్ తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చాడు.
ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న వ్యక్తి తెల్లవారి ఎంతసేపైనా తలుపులు తీయలేదు. కిటికీ అద్దాలను తొలగించిన కుటుంబసభ్యులకు అతను శవమై వేలాడుతూ కనిపించాడు. దాంతో పోలీసులను పిలిపించి కేసు నమోదు చేశారు.
ఈ విషయమై విచారణ చేపట్టినట్లు పనాజీ ప్రాంతానికి చెందిన ఎస్సై సంతోష్ దేశాయ్ తెలిపారు.
ఇంతకుముందు ఎస్‌ఈఎస్‌ఏ ఫుట్‌బాల్ అకాడమీలో చేరిన అవెరిస్థో అండర్-15జట్టులో ఆడాడు. మూడేళ్ల అనంతరం అదే అకాడమీకి చెందిన అండర్ 20జట్టులో చేరాడు. తను మంచి స్ట్రైకర్ సామర్థ్యం కలవాడని జట్టు సభ్యులు పేర్కొన్నారు.
గోవా తరపున 2010-2011కు గాను అండర్ 16 జట్టు ఆడిన బీసి రాయ్ జాతీయ టోర్నమెంట్‌లో ఆడాడు. గోవా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్విస్ గోమ్స్ క్రీడాకారుడి మృతి చెందిన వార్త విన్న వెంటనే షాక్ గురైయ్యాడు. గోవా జట్టుకు అతని మృతి తీరని లోటంటూ విచారం వ్యక్తం చేశారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.