న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రిఫరీ సెల్ఫీ మోజు ఎంతపని చేసింది!: యెల్లో కార్డు చూపించి మరీ విజ్ఞప్తి (వీడియో)

Yellow card and a selfie: Referee shares a sweet moment with Brazil football legend Kaka

హైదరాబాద్: రిఫరీకి ఉన్న సెల్ఫీ మోజు మ్యాచ్‌ని ఆపేలా చేసింది. ఓ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో భాగంగా ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా రిఫరీ తను ఆరాధించే సాకర్ ప్లేయర్‌కి యెల్లో కార్డు చూపించి వార్నింగ్‌ ఇవ్వడంతో పాటు అతడిని అక్కడే ఆపి ఒక సెల్ఫీ దిగడం ఇప్పుడు సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే.... బ్రెజిల్‌-ఇజ్రాయిల్‌ మధ్య హైఫా వేదికగా ఓ ఛారిటీ పుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ జట్టు 4-2 తేడాతో ఇజ్రాయిల్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌కు స్టార్ ప్లేయర్లు పాల్గొన్నారు. దీంతో దిగ్గజ ఆటగాడు కాకాతో మహిళా రిఫరీ సెల్ఫీ దిగేందుకు అతడికి యెల్లో కార్డు చూపించింది.

లక్కీ ఫ్యాన్: తన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్‌ బైక్‌పై ధోని ఆటోగ్రాఫ్‌ (వీడియో)లక్కీ ఫ్యాన్: తన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్‌ బైక్‌పై ధోని ఆటోగ్రాఫ్‌ (వీడియో)

ఈ సంఘటనతో మ్యాచ్‌ను వీక్షిస్తోన్న అభిమానులకు అసలేం జరుగుతుందో కాసేపు అర్ధం కాలేదు. గేమ్‌లో భాగంగా తొలుత కాకాకు యెల్లో కార్డు చూపించిన రిఫరీ లిలాచ్‌ అసులిన్‌ ఆ తర్వాత అతడిని ఉండమంటూ విజ్ఞప్తి చేసింది. కాకా ఏ పొరపాటు చేయకున్నా యెల్లో కార్డు చూపించడంతో బ్రెజిల్ ఆటగాళ్లు రిఫరీతో వాగ్వాదానికి సిద్దమయ్యారు.

పిక్ వైరల్: ఇషాంత్ శర్మ అయితే జాట్లాన్ అంటాడేంటి!: రోహిత్‌కు మతి పోయిందా?పిక్ వైరల్: ఇషాంత్ శర్మ అయితే జాట్లాన్ అంటాడేంటి!: రోహిత్‌కు మతి పోయిందా?

ఇంతలో వారికి ఊహించని పరిణామం ఎదురైంది. యెల్లో కార్డు చూపించిన రిఫరీ ఏం చేస్తుందా? అని చూసే సమయంలో ఆమె తన జేబులో నుంచి సెల్‌ ఫోన్‌ను నెమ్మదిగా తీసి సెల్ఫీ ఇవ్వాలంటూ కాకాను అడిగింది. ఇక చేసేదేమీ లేక కాకా సైతం ఆమెతో సెల్ఫీకి అంగీకరించాడు. ఈ ఘటనకు ప్రత్యర్థి ఇజ్రాయిల్‌ ఆటగాళ్లు కూడా షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Friday, November 1, 2019, 18:13 [IST]
Other articles published on Nov 1, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X