Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్రీ స్టయిల్‌లో 800 మందితో.. మోడల్ (వీడియో)

రియో డి జెనీరో: ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్ కప్ జోరు కనిపిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ ప్రపంచ కప్ ముగియనుంది. ఈ నేపథ్యంలో అర్జెంటీనకు చెందిన ఓ మోడల్.. తాను ఫ్రీస్టైల్‌లో ఎనిమిది వందల మందితో ఆడి, వారిని ఓడించానని.. తన తదుపరి టార్గెట్ లియోనల్ మెస్సీ అని చెబుతోంది.

ఈ అర్జెంటీనా మోడల్ పేరు ఫియోరెల్లా కాస్టిల్లో. ఆమె వయస్సు ఇరవై నాలుగేళ్లు. ఆమెకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

World Cup Video: Model beats 800 men at freestyling, next target Lionel Messi!

ఆమె రియో డి జెనీరోలోని ఇపనేమా బీచ్‌లో ఫ్రీస్టైల్ ఫుట్‌బాల్ ఆడుతూ హల్ చల్ చేస్తున్న వీడియోకు ఇంటర్నెట్‌లో హిట్స్ బాగా వస్తున్నాయి. తాను ఎనిమిది వందల మంది పైన గెలిచానని, మెస్సీ పైన ఆడాలని భావిస్తున్నట్లు చెబుతోంది. ఈ వీడియోలో ఆమె ఫుట్‌బాల్ ఆడుతూ.. ఫ్రీస్టైల్లో తన స్కిల్స్ చూపిస్తోంది!

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/-X9gQHZuenw?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

వీడియోలో, సదరు మోడల్ మాట్లాడుతూ... తాను ఫుట్‌బాల్ ఆటను ప్రేమిస్తానని, తాను ఎనిమిది వందల మందితో ఆడి గెలిచిన రోజు అద్భుతమైనదని, తాను సంతోషంగా ఇంటికి వెళ్తానని చెబుతోంది. అంతేకాదు మరో సవాల్ కూడా విసిరింది. తనను ఎవరైనా ఫేస్ చేయాలనుకుంటే (తనతో ఆడాలనుకుంటే) రావొచ్చునని చెబుతోంది. కేవలం ముగ్గురు మాత్రమే మిగిలిపోయారని, అందులో ఒకరు తన పక్కన ఆడుతున్న వారు అంటూ పేర్కొంది. తాను మెస్సీ పైన కచ్చితంగా గెలుస్తానని చెబుతోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+