For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒమన్‌తో భారత్‌ అమీతుమీ.. ఓడితే ప్రపంచకప్‌ ఆశలు గల్లంతు!!

World Cup Qualifiers: India face Oman in do-or-die away match

మస్కట్‌: ఒమన్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి భారత ఫుట్‌బాల్‌ జట్టు సిద్ధంగా ఉంది. 2022 ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ గ్రూప్‌-ఈలో భాగంగా భారత్‌ (106)-ఒమన్‌ (84) మధ్య మంగళవారం మ్యాచ్‌ జరుగనుంది. ఫిఫా ప్రపంచకప్‌ అర్హత రేసులో నిలవాలంటే భారత్‌కు ఒమన్‌పై విజయం సాధించడం తప్పనిసరి. ఒకవేళ ఓడితే మాత్రం ప్రపంచకప్‌ దారులు మూసుకుపోయినట్లే.

ఇప్పటికే భారత్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఒక దాంట్లో ఓడి.. మూడింటిని డ్రా చేసుకుంది. దీంతో భారత్‌ 3 పాయింట్లతో గ్రూప్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఒమన్‌ నాలుగింటిలో మూడు గెలిచి 9 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. క్వాలిఫయర్స్‌ తొలి అంచె పోటీల్లో ఇరు జట్లు గువాహటి వేదికగా తలపడగా.. భారత్‌ 1-2తో ఓటమి చవిచూసింది. ముందుగా భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ గోల్‌ కొట్టి గెలుపు ఆశలను పెంచినా.. చివరి 10 నిమిషాల్లో ఒమన్‌ రెండు గోల్స్‌ చేసి నీళ్లు చల్లిన సంగతి తెలిసిందే.

అనంతరం ఆసియా చాంపియన్‌ ఖతర్‌తో జరిగిన మ్యాచ్‌లో అంచనాలకు మించి రాణించిన భారత్‌.. ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అయితే విజయాలు ఖాయం అనుకున్న బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లను డ్రాతో సరిపెట్టుకున్న భారత్‌.. ప్రస్తుతం చావో రేవో పరిస్థితి తెచ్చుకుంది.

గత రెండు మ్యాచ్‌ల్లోనూ సునీల్‌ చెత్రి ఎటువంటి ప్రభావం చూపలేకపోయాడు. ఇప్పటికైనా అతడు చెలరేగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించడం అంత సులభం కాదు. ఒమన్‌కు పోటీ ఇవ్వాలంటే భారత్‌ అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిఫెన్స్‌ విషయంలో మెరుగవ్వాలి. అయితే స్టార్‌ ప్లేయర్లు సందేశ్‌ జింగ్యాన్‌, బోర్గ్స్‌, అమర్‌జీత్‌ సింగ్‌, అనస్‌ దూరం కావడం జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.

ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ రెండో రౌండ్‌లో ఎనిమిది గ్రూపుల్లో చెరో ఐదు జట్లు ఉన్నాయి. గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లతో పాటు నాలుగు అత్యుత్తమ రన్నరప్‌ టీమ్‌లు (12 జట్లు) ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ మూడో రౌండ్‌కు చేరుతాయి. గ్రూప్‌-ఈలో ఉన్న భారత్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. మూడు మ్యాచ్‌లు డ్రా చేసుకొని.. ఓ ఓటమితో 3 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఖతార్‌ (10), ఒమన్‌ (9), ఆఫ్ఘనిస్థాన్‌ (4) భారత్ కంటే పైనే ఉండగా.. బంగ్లా (1) మాత్రమే కింది ఉంది. రాత్రి గం. 8.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-1లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

Story first published: Tuesday, November 19, 2019, 12:34 [IST]
Other articles published on Nov 19, 2019
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+