ఆట మధ్యలో గొడవకి దిగిన జిదానే, తలతో కుమ్మి...

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ఫుట్‌బాల్ ఆటలో వివాదాలకేం కొత్త కాదు. అలాంటిది ప్రపంచ కప్ టోర్నీ గురించి చెప్పక్కర్లేదు. వివిధ దేశాల ఆటగాళ్లు వారి నేపథ్యాలను బట్టి తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి సంఘటనే 2006 ప్రపంచకప్ ఫైనల్.. మ్యాచ్‌లో ఒకటి చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అతిపెద్ద వివాదమే కాదు.. అసలు ఏం జరిగిందో ఊహాగానాలు చేసిన ముఖ్య సంఘటనగా మిగిలిపోయింది.

అసలేం జరిగింది:
ఒకవైపు కీలకమైన ఫైనల్ మ్యాచ్..ఫ్రాన్స్ ఆశలన్నీ వారి స్టార్ జినెదిన్ జిదాన్ పైనే.. దీంతో ప్రత్యర్థి ఇటలీ ఆటగాళ్లంతా కలిసి జిదాన్‌ను నియంత్రించడంపైనే దృష్టి పెట్టారు. పటిష్ఠమైన మార్కింగ్‌తో ఈ స్టార్ స్ట్రయికర్‌ను కట్టిపడేసినా ..అతన్ని నియంత్రించడంలో ఇటలీ డిఫెండర్లు తడబడుతూనే ఉన్నారు. మ్యాచ్ నిర్ణీతసమయం పూర్తైంది. ఎక్స్‌ట్రా టైమ్‌లో 1-1తో స్కోర్లు సమంగా ఉన్న దశలో కోట్లాది సాకర్ అభిమానులకు షాక్ తగిలింది.

తలతో మెటెరాజ్జిని ఛాతీపై బలంగా:
మైదానంలో ఇటలీ డిఫెండర్ మార్కో మెటెరాజ్జిని, జిదాన్ ఇద్దరూ ఏదో అనుకోవడం కనిపించింది. అనూహ్యంగా జిదాన్ తన తలతో మెటెరాజ్జిని ఛాతీపై బలంగా కుమ్మాడు. దీంతో మెటెరాజ్జి కిందపడిపోయాడు. దీంతో రిఫరీ దిగ్గజ ఆటగాడు జిదాన్‌కు రెడ్‌కార్డు చూపి మైదానం బయటకు పంపాడు. అనంతరం ఈ ఫైనల్ మ్యాచ్‌లో పెనాల్టీషూటౌట్‌లో 5-3 గోల్స్‌తో ఇటలీ విజయం సాధించింది.

మెటెరాజ్జి ..జిదానే తల్లిని అనకూడని:
మెటెరాజ్జి ..జిదానే తల్లిని అనకూడని మాట అన్నాడని, అందుకే అతను తలతో కుమ్మాడని వార్తలు వెలువడినా నిజం మాత్రం తెలియలేదు.. కాగా, జిదాన్ సోదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యతో తీవ్ర ఆగ్రహంతో జిదాన్ తనను కుమ్మినట్లు మెటరాజ్జి వెల్లడించాడని వార్తలు వచ్చాయి. జిదాన్ చేసిన పనితో ఫ్రాన్స్ టైటిల్ ఆశలు అడియాసలు కాగా.. ప్రపంచకప్ చరిత్రలో ఇది పెను వివాదంగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications