జొహన్నెస్ బర్గ్: ఊపిరి బిగపట్టండి. ఉత్కంఠగా చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులు ఎదురుచూస్తున్న సాకర్ సమరం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్ సాకర్ సిటీ స్టేడియంలో సాయంత్రం 5.30గంటలకు 19వ ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలు ప్రారంభమవుతాయి.
తొలిరోజు దక్షిణాఫ్రికా-మెక్సికో, ఉరుగ్వే-ఫ్రాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ పోటీలు నెలరోజులపాటు ఫుట్ బాల్ అభిమానులకు కనువిందుచేయనున్నాయి. ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సాకర్ సిటీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దక్షిణాఫ్రికా తొలిసారిగా ప్రపంచ ఫుట్ బాల్ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తోంది. ప్రపంచంలోని 32 జట్లు పోటీల్లో పాల్గొనున్నాయి.