Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రష్యా ఆడవాళ్లతో సెక్స్ చేయొద్దంటూ కోచ్ సూచనలు

World Cup expected to spark a mini-boom in prostitution across Russia

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్ నేపథ్యంలో నైజీరియా జట్టు గట్టి బందోబస్తు చర్యలే చేపడుతోంది. ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది, వ్యూహాలకు పదును పెడుతుంది. తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు కొన్ని ఆంక్షలను కూడా ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జరుగుతున్న ప్రదేశంలో రష్యన్ మహిళలతో ఎలా మెలగాలో ఓ పుస్తకాన్ని కూడా అర్జెంటీనా నుంచి అందిపుచ్చుకుంది. వాళ్లను అస్సలు గదుల్లోకి అనుమతించొద్దంటూ కరాఖండిగా తేల్చి చెప్పింది.

ఆటగాళ్లకు అలాంటి షరతునే

ఆటగాళ్లకు అలాంటి షరతునే

ఇలా తమ ఆటగాళ్లు ఏం చేయాలో.. ఏం చేయకూడదో కోచ్‌లు నిక్కచ్చిగా చెప్పడం.. అమలయ్యేలా చూడడం సాకర్‌ సమరంలో సాధారణం. అలా వారు విధించే ఆంక్షలు కొన్నిసార్లు ఆసక్తిని కలిగిస్తాయి. ఈసారి నైజీరియా కోచ్‌ గెర్నోట్‌ రోర్‌ తమ ఆటగాళ్లకు అలాంటి షరతునే విధించాడు. వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు రష్యా వచ్చిన ప్లేయర్లు స్థానిక అమ్మాయిలను కలవ కూడదని, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగారంలో పాల్గొనకూడదని ఆదేశించాడు. కారణం లేకపోలేదు.

పుస్తకాన్ని విడుదల చేసింది

పుస్తకాన్ని విడుదల చేసింది

ఒకవేళ శృంగారంలో పాల్గొంటే, వారు నిదానంగా ట్రాప్‌లోకి దింపి ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడతారని సూచించాడు. అయితే ఈ విషయంపై అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఓ పుస్తకాన్ని సైతం విడుదల చేసింది. అర్జెంటీనా వ్యభిచారిణులతో పాల్గొనేటప్పుడు వారు ఎలా ప్రవర్తించాలో అందులో పొందుపరిచారు. దీనికి సంబంధించి సడలింపు ఏమంటే, టోర్నీ అయ్యేంత వరకూ ఆటగాళ్లు శృంగారానికి దూరంగా ఉండాలని మాత్రం అతను చెప్పలేదు.

రష్యా అమ్మాయిల జోలికెళ్లొద్దని

రష్యా అమ్మాయిల జోలికెళ్లొద్దని

కేవలం రష్యా అమ్మాయిల జోలికెళ్లొద్దన్నాడు. ప్లేయర్లు తమ భార్యలను, ప్రియురాళ్లను వెంట తెచ్చుకోవచ్చన్నాడు. మ్యాచ్‌ ప్రాక్టీస్‌, మ్యాచ్‌లు లేని రోజుల్లో వారితో గడిపేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అయితే, ఒక రష్యన్‌తో సహజీవనం చేస్తోన్న కెప్టెన్‌ జాన్‌ మికెల్‌ ఒబికి మాత్రం మినహాయింపు ఇచ్చాడు.

ఆటగాళ్లు రష్యన్లకు దూరంగా ఉండాలని

ఆటగాళ్లు రష్యన్లకు దూరంగా ఉండాలని

మిగతా ఆటగాళ్లు రష్యన్లకు దూరంగా ఉండాలని చెప్పడానికి కారణం లేకపోలేదు. కొందరు అమ్మాయిలు, వ్యభిచారులు తమ అందాలతో వల విసిరి తర్వాత బ్లాక్‌మెయిల్‌ చేస్తారని భద్రతా సిబ్బంది హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Story first published: Sunday, June 10, 2018, 11:37 [IST]
Other articles published on Jun 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+