For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెజిల్ శుభారంభం, ఊపేసిన జెన్నీఫర్ లోపేజ్ (పిక్చర్స్)

By Srinivas

సాకర్ ప్రపంచకప్‌లో ఆతిథ్య బ్రెజిల్ శుభారంభం చేసింది. కొయేషియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 20వ నిమిషంలో క్రొయేషియా ఆటగాళ్లు బ్రెజిల్ గోల్ పోస్టు వైపు దూసుకువచ్చారు. క్రొయేషియా ఆటగాడిని సమర్థవంతంగా అడ్డుకున్న బ్రెజిల్ డిఫెండర్లు అతని నుంచి బంతిని ఎగరేసుకుపోయే సందర్భంగా స్వంత గోల్ పోస్టులోకే బంతిని తన్ని సెల్ఫ్ గోల్ చేశారు.

దీంతో క్రొయేషియాకు ఆధిక్యం లభించింది. దానిని కాపాడుకునేందుకు క్రొయేషియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ 71వ నిమిషంలో బ్రెజిల్ ఆటగాడు నైమార్ తొలి గోల్ కొట్టి స్కొరు సమం చేశాడు.

అనంతరం 91వ నిమిషంలో మరో ఆటగాడు ఆస్కార్ గోల్ కొట్టి బ్రెజిల్‌కు ఆధిక్యం ఇచ్చాడు. ఆ తర్వాత నైమార్ గోల్ కొట్టి బ్రెజిల్‌కు తిరుగులేని ఆధిక్యం అందించాడు. దీంతో బ్రెజిల్ 3-1 తేడాతో శుభారంభం చేసింది.

బ్రెజిల్

బ్రెజిల్

ప్రపంచకప్‌లో ఆతిథ్య బ్రెజిల్ శుభారంభం చేసింది. కొయేషియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 20వ నిమిషంలో క్రొయేషియా ఆటగాళ్లు బ్రెజిల్ గోల్ పోస్టు వైపు దూసుకువచ్చారు. క్రొయేషియా ఆటగాడిని సమర్థవంతంగా అడ్డుకున్న బ్రెజిల్ డిఫెండర్లు అతని నుంచి బంతిని ఎగరేసుకుపోయే సందర్భంగా స్వంత గోల్ పోస్టులోకే బంతిని తన్ని సెల్ఫ్ గోల్ చేశారు.

బ్రెజిల్

బ్రెజిల్

దీంతో క్రొయేషియాకు ఆధిక్యం లభించింది. దానిని కాపాడుకునేందుకు క్రొయేషియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ 71వ నిమిషంలో బ్రెజిల్ ఆటగాడు నైమార్ తొలి గోల్ కొట్టి స్కొరు సమం చేశాడు.

బ్రెజిల్

బ్రెజిల్

అనంతరం 91వ నిమిషంలో మరో ఆటగాడు ఆస్కార్ గోల్ కొట్టి బ్రెజిల్‌కు ఆధిక్యం ఇచ్చాడు. ఆ తర్వాత నైమార్ గోల్ కొట్టి బ్రెజిల్‌కు తిరుగులేని ఆధిక్యం అందించాడు. దీంతో బ్రెజిల్ 3-1 తేడాతో శుభారంభం చేసింది.

సాకర్

సాకర్

మరోవైపు సాకర్ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 32 జట్లు పాల్గొంటున్న వరల్డ్ కప్ సంబరం సుమారు నెల రోజులు కొనసాగుతుంది.

సాకర్

సాకర్

ప్రపంచ కప్ నేపథ్యంలో పోటీలు జరిగే 12 కేంద్రాల్లో సందడి నెలకొంది. ప్రారంభోత్సవంలో భారీ ప్రసంగాలకు నిర్వాహకులు ముందుగానే కత్తెర వేశారు.

సాకర్

సాకర్

అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్‌సహా ఎవరూ సుదీర్ఘ ప్రసంగాలు చేయకుండా పకడ్బందీగా షెడ్యూల్‌ను రూపొందించడంతో ప్రారంభోత్సవం క్లుప్తంగా, అందరినీ ఆకట్టుకునే రీతిలో సాగింది.

 సాకర్

సాకర్

ఈసారి వరల్డ్ కప్‌ను ‘గ్రీన్ గేమ్స్'గా నిర్వహిస్తామని బ్రెజిల్ ఇది వరకే ప్రకటించింది. అందుకు అనుగుణంగా ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సాకర్

సాకర్

దేశంలోని పలు ప్రాంతాల్లో జెయింట్ స్క్రీన్లను ఏర్పాటు చేసి, ప్రారంభోత్సవంతో పాటు మ్యాచ్‌లను తిలకించే అవకాశాన్ని అభిమానులకు కల్పిస్తున్నారు.

సాకర్

సాకర్

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోకూ సాకర్ పీవర్ వ్యాపించింది. భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ ఎక్కువగా ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అభిమానులు వీధుల్లో నృత్యాలు చేస్తూ ఆనందాన్ని చాటుకున్నారు. గురువారం మొదలుకొని, వచ్చేనెల 13న జరిగే ఫైనల్ వరకూ వరల్డ్ కప్‌లో ప్రతి క్షణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు.

 సాకర్

సాకర్

మొట్టమొదటి సారిగా గోల్ టెక్నాలజీని ఉపయోగించడంతో బ్రెజిల్ వరల్డ్ కప్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ టోర్నమెంట్‌కు ఉన్న భారీ ఆదరణను సొమ్ము చేసుకోవడానికి ఇటలీ ప్రయత్నిస్తున్నది. వరల్డ్ కప్ కవరేజ్ కోసం వచ్చిన ఇటలీ పాత్రికేయుల నుంచి భారీగా ఫీజు వసూలు చేయడం విచిత్రం. ఇలావుంటే, 64 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్‌లో టైటిల్ సాధించాలని బ్రెజిల్ పట్టుదలతో ఉంది.

సాకర్

సాకర్

డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ టైటిల్ నిలబెట్టుకోవడానికి పోరాడనుంది. ఇప్పటి వరకూ ఐదు పర్యాయాలు విశ్వవిజేతగా నిలిచిన బ్రెజిల్ ఆరోసారి టైటిల్ దక్కించుకుంటుందో, స్పెయిన్ తన ఆధిపత్యాన్ని కొనసాగించనుందో.

సాకర్

సాకర్

అర్జెంటీనా కూడా హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతోంది. జర్మనీ, ఉరుగ్వే, పోర్చుగల్ తదితర దేశాల నుంచి కూడా గట్టిపోటీ ఉండే అవకాశం ఉంది. హేమాహేమీ జట్లు, ప్రపంచ మేటి స్టార్లు పోటీపడుతున్న కారణంగా బ్రెజిల్ వరల్డ్ కప్‌లో ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్‌ను తలపించడం ఖాయం. కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి.

సాకర్

సాకర్

కాగా సాకర్ ప్రేమికుల హర్షాతిరేకాల మధ్య బ్రెజిల్‌లో ప్రపంచ కప్ ఘనంగా మొదలైంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బంతి ఆకృతిలో టోర్నీలో పోటీ పడుతున్న అన్ని దేశాల భాషల్లో స్వాగతం అని ప్రదర్శించడం ద్వారా కార్యక్రమం మొదలైంది. బ్రెజిల్ నృత్యం, సంగీతం అలరించాయి. పాప్ గాయని జెన్నీఫర్ లోపేజ్, క్లాడియా లీటె, పిత్బుల్ ప్రపంచ కప్ అధికారిక గీతాన్ని ఆలపించారు. అట్టహాసంగా వరల్డ్ కప్ ప్రారంభ వేడుకలు జరిగాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+