For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిఫా వరల్డ్ కప్ 2018: బంతి మారింది, అన్ని దేశాల రంగుల్ని కలిపి...

World Cup 2018: Adidas unveil match ball for the knockout stage
World Cup ball: Why have FIFA changed to red Telstar Mechta? Is there any difference?

హైదరాబాద్: ప్రపంచకప్ పురస్కరించుకుని ఆనవాయితీగా బంతులు పంపిణీ చేస్తున్న అడిడాస్ సంస్థే వరల్డ్ కప్‌ అధికారిక మ్యాచ్‌ బాల్‌ను అందిస్తోంది. జూన్ 14 నుంచి ప్రారంభమై గ్రూపు దశను పూర్తి చేసుకున్న సందర్భంగా బంతిని మారుస్తున్నారు నిర్వహకులు. లీగ్‌ మ్యాచ్‌ల్లో ఉపయోగించిన బంతి స్థానంలో కొత్తగా ఎరుపు-తెలుపు బంతి రానుంది. నాకౌట్‌ దశ నుంచి ఈ బంతికి బదులు 'టెల్‌స్టార్‌ మెక్టా' అనే బాల్‌ను వినియోగించనున్నారు.

నాకౌట్‌కు చేరిన దేశాల జెండా రంగులు అందులో ప్రతిబింబించేలా టెల్‌స్టార్‌ మెక్టాను రూపొందించారు. మెక్టా అంటే 'కల' అని అర్థం. శనివారం నుంచి ఈ కల మన కళ్లముందు ఆడనుంది. 1970 నుంచి ప్రపంచకప్‌ కోసం అడిడాస్‌ సంస్థ బంతులను తయారుచేస్తోంది. ఆ సంస్థ ప్రపంచకప్‌ కోసం తొలిసారిగా తయారుచేసిన బంతికి 'టెల్‌స్టార్‌' అని పేరు పెట్టింది. దాని కొనసాగింపుగా 2018 సంవత్సరాన్ని సూచిస్తూ ప్రస్తుత టోర్నీలో వాడే బంతికి 'టెల్‌స్టార్‌ 18' అని పేరు పెట్టారు.

బంతులను పాకిస్థాన్‌లోని సియాల్ కోట్‌లో తయారు చేయడం విశేషం. గతంలో బ్రెజిల్‌లో జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సమయంలోనూ పాకిస్థాన్‌లో రూపొందించిన బంతులనే ఉపయోగించారు. వాటికి బ్రజూకా అని పేరు పెట్టారు. అయితే, ఈ వరల్డ్ కప్‌లో వాడబోయే బంతిపై ఆరు ప్యానెల్స్‌ ఉన్నాయి. బరువు 215 గ్రాములు. 1930లో జరిగిన తొలి ప్రపంచకప్‌ కోసం ప్రత్యేకంగా అధికారిక బంతి అంటూ ఏమీలేదు. బంతిపై ఆంగ్గ అక్షరం 'టి'ని పోలిన కుట్లు ఉండడంతో దాన్ని టీ-మోడల్‌ అని పిలిచేవారు.

తాజా వరల్డ్ కప్‌లో వాడబోయే బంతులను సియాల్‌కోట్‌లో తయారు చేశారు. క్రీడా ఉపకరణాల తయారీకి సియాల్‌కోట్ ప్రాంతం పెట్టింది పేరు. ఇక్కడ నెలకు 7 లక్షల ఫుట్‌బాళ్లను ఉత్పత్తి చేస్తారు. బ్రిటిషర్ల పాలన కాలంలో ఇక్కడ ఫుట్‌బాల్స్ తయారీ ప్రారంభమైంది. సమయం ఆదా చేసుకోవడం కోసం బ్రిటిషర్లు ఇక్కడ ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. 1980లో సియాల్‌కోట్‌కు ఫుట్‌బాల్ తయారీలో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 1982 ఫుట్‌‌బాల్ వరల్డ్ కప్‌లో ఉపయోగించిన ట్యాంగో బాల్‌ను ఇక్కడే తయారు చేశారు.

Story first published: Saturday, June 30, 2018, 13:07 [IST]
Other articles published on Jun 30, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+