
తొలి మ్యాచ్‌లోనే కష్టాలు మొదలు:
ఫిఫా ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న సౌదీ అరేబియాపై రష్యా 5-0తో ఘనవిజయం సాధించి ఆతిథ్య ఆరంభాన్ని అద్భుతంగా కొనసాగించింది. ఇక ప్రపంచకప్ అరంగ్రేట మ్యాచ్‌లోనే ఐస్‌లాండ్ అదరగొట్టేసింది. పటిష్ఠ అర్జెంటీనాను ఈ పసికూన ఐస్‌లాండ్ 1-1తో డ్రాగా నిలువరించింది. దీంతో తొలి మ్యాచ్ నుంచే అర్జెంటీనాకు కష్టాలు మొదలయ్యాయి. ఒకానొక దశలో నాకౌట్‌కు చేరడం కూడా గగనమే అనే స్థితికి చేరుకుంది ఆ జట్టు. కానీ, చివర్లో నైజీరియా మీద గెలవడంతో మెస్సి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అరుదుగా లభించిన గోల్స్
గ్రూప్ దశలో 48మ్యాచ్‌లు జరగ్గా.. అందులో నమోదైన మొత్తం గోల్స్ సంఖ్య 122. అంటే సగటున ప్రతి మ్యాచ్‌కు 2.5గోల్‌లు నమోదయ్యాయన్నమాట. ప్రతి మ్యాచ్‌లోనూ గోల్ నమోదు అవుతుండటంతో దాదాపు ఈసారి గోల్ లేని డ్రాగా మ్యాచ్‌లు ఉండకపోవచ్చు అనుకున్నారు. కానీ, గ్రూప్-సిలో ఫ్రాన్స్-డెన్మార్క్ మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో గోల్ లేని మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక గ్రూప్ దశలోనే సెల్ఫ్ గోల్ సంఖ్య 9కి చేరుకోవడం విశేషం. ఇప్పటివరకూ ఏ ప్రపంచకప్‌లో ఈ స్థాయిలో సెల్ఫ్ గోల్‌లు నమోదు కాలేదు. గ్రూప్-ఏలో మొరాకో-ఇరాన్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లోనే మొదటి సెల్ఫ్ గోల్ నమోదైంది. మొత్తం 32జట్లలో కేవలం రెండు జట్లు మాత్రమే కనీసం ఒక్క పాయింట్ సాధించకుండా గ్రూప్ దశలో నిష్క్రమించాయి. గ్రూప్-ఏలో ఈజిప్టు, గ్రూప్-సిలో పనామా కనీసం ఒక్క పాయింట్ కూడా లేకుండానే ఇంటిముఖం పట్టాయి.

పెనాల్టీలు పెరిగి, రెడ్ కార్డ్‌లు తగ్గి:
వీడియో సమీక్ష సహాయం(వార్) రాకతో ఈసారి గ్రూప్ దశలో రెడ్ కార్డు, ఎల్లో కార్డుల సంఖ్య చాలా తక్కువగా నమోదైంది. మొత్తంగా 158పసుపుకార్డులు, 3రెడ్ కార్డులు వచ్చాయి. ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారిగా పెనాల్టీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ఇప్పటివరకూ ఇటలీలో జరిగిన 1990 వరల్డ్‌కప్‌లో మొత్తం 18పెనాల్టీలు రాగా, ఈ ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే మొత్తం 24పెనాల్టీలు వచ్చాయి. అందులో 18విజయవంతమయ్యాయి.

అటుఇటుగా నాకౌట్‌కు చేరిన జట్లు
అతి తక్కువ పాయింట్లతో నాకౌట్‌కు చేరుకున్న జట్లుగా అర్జెంటీనా(4), జపాన్(4) నిలిచాయి. ఇందులోనూ మాజీ ఛాంపియన్ అర్జెంటీనా తన గ్రూప్‌లోని ఇతర జట్ల విజయం మీద ఆధారపడి మరీ గట్టెక్కడం గమనార్హం. అది కూడా నెగిటివ్ పాయింట్లతో అర్జెంటీనా(-2) నాకౌట్‌కు చేరుకుంది. దీనితోపాటు గ్రూప్-ఎఫ్‌లో మెక్సికో(-1)తో నాకౌట్‌కు చేరింది. ఫెయిర్ ప్లే ర్యాంకింగ్ ద్వారా తొలిసారి నాకౌట్‌కు చేరిన జట్టుగా జపాన్ నిలిచింది. ఈసారి ప్రపంచకప్‌లో ఆసియా నుంచి అర్హత సాధించిన ఏకైక జట్టు కూడా జపాన్ కావడం మరో విశేషం. ఇక గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా బెల్జియం, క్రొయేషియా, ఉరుగ్వే నేరుగా నాకౌట్‌కు చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications














