ఫిఫా: రష్యా ప్రధాని ముందు క్రొయేషియా అధ్యక్షురాలి సంబరాలు (వీడియో)

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ నుంచి ఆతిథ్య రష్యా నిష్క్రమించింది. టోర్నీలో భాగంగా ఫిష్ట్ స్టేడియంలో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. నిర్ణీత సమయంలో రష్యా, క్రొయేషియా చెరో గోల్ చేశాయి. ఇక, అదనపు సమయంలోనూ ఒక్కో గోల్ చేయడంతో 2-2తో స్కోరు సమం కావడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది.
నిర్ణయాత్మక పెనాల్టీ షూటౌట్‌లో క్రొయేషియా 4-3తో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది. వరల్డ్‌కప్‌లో క్రొయేషియా సెమీస్ చేరడం ఇది రెండోసారి. 1998లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. కాగా, రష్యా తరఫున డెనిస్ చెరిషెవ్ (31వ ని), మరియో ఫెర్నాండెస్ (115వ ని) చెరో గోల్ చేయగా... క్రొయేషియా తరఫున అండ్రెజ్ క్రామరిక్ (39వ ని), డొమగొజ్ విదా (100వ ని) గోల్ చేశారు.

షూటౌట్‌లో విఫలమైన రష్యా
షూటౌట్‌లో రష్యా జట్టులో స్మొలొవ్‌తో పాటు ఫెర్నాండెస్ విఫలం కాగా జగొయెవ్, ఇగ్నాషెవిచ్, కుజియయెవ్ గోల్ సాధించారు. క్రొయేషియాలో మటే కొవసిక్ మినహా బ్రొజొవిక్, మోడ్రిక్, విదా, రకిటిక్ గోల్ చేసి ఆ జట్టుని సెమీస్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో బుధవారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో క్రొయేషియా తలపడనుంది.

సంబరాల్లో మునిగిపోయిన క్రొయేషియా జట్టు
వరల్డ్‌కప్‌లో క్రొయేషియా జట్టు మరో సెమీస్‌కు చేరడంతో ఆ దేశస్థులు సంబరాల్లో మునిగిపోయారు. ఆ దేశ అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్ కిటారోవిక్ ఆనందానికైతే అవధుల్లేవు. రష్యా ప్రధానమంత్రి దిమిత్రి మెద్వెదేవ్, ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్ఫాంటినోతో పాటుగా క్రొయేషియా అధ్యక్షురాలు కూడా ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు.
ఆటగాళ్లకు మద్దతు తెలిపిన క్రొయేషియా ప్రధానమంత్రి
క్రొయేషియా జెర్సీ ధరించి మ్యాచ్‌లో తమ దేశ ఆటగాళ్లకు ఆమె మద్దతు తెలిపారు. అంతేకాదు, మ్యాచ్ ఆరంభం నుంచి ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ క్రమంలో తమ జట్టు తరఫున రెండో గోల్ నమోదైన వెంటనే రష్యా ప్రధానమంత్రి ఎదురుగానే ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వరల్డ్‌కప్‌లో క్రొయేషియా సెమీస్ చేరడం ఇది రెండోసారి
ఇక, పెనాల్టీ షూటౌట్‌లోనూ 4-3తో క్రొయేషియా విజయం సాధించడంతో మ్యాచ్ అనంతరం జట్టు సభ్యులతో కలిసి ఆమె సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశాధ్యక్షురాలు అని ఏ మాత్రం గర్వం లేకుండా ఆటగాళ్లతో కలసి డ్యాన్స్ చేయడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications