ప్రేమలో పడేసిందన్న షకీరా.. ఇలా ఊపేసింది (పిక్చర్స్)
రియో డి జనీరో: వాకా వాకా పాటతో 2010 ప్రపంచ కప్‌లో దుమ్ము రేపిన పాప్ సింగర్ షకీరా... ప్రపంచకప్ తన జీవితాన్ని మార్చి వేసిందని చెబుతోంది.
ప్రపంచకప్‌ను తాను ఎప్పుడు మరిచిపోనని, ఎందుకంటే తన జీవితాన్ని అది ప్రేమమయం చేసిందని షకీరా చెబుతోంది. 2010 ప్రపంచ కప్ గీతం వాకా వాకా ప్రచార కార్యక్రమంలోనే షకీరా స్పెయిన్ డిపెండర్ గెరార్డ్ పిక్ ప్రేమలో పడింది.
ఇప్పుడు వీరిద్దరికి 18 నెలల కొడుకు ఉన్నాడు. ఈ సందర్భంగా షకీరా మాట్లాడుతూ... ప్రపంచకప్ లేకపోతే తన కొడుకు మిలన్ ఉండేవాడు కాదని పేర్కొంది.

షకీరా
ఆదివారం ప్రపంచ కప్ ఫైనల్ వేదికైన మారకానా స్టేడియంలో షకీరా పాడుతుంటే అభిమానులు నృత్యం చేస్తూ మంత్రముగ్దులయ్యారు.

షకీరా
షకీరా.. పాటకు, నృత్యానికి అభిమానులు కూడా జత కలిశారు. ఒక్క షకీరాయే కాదు.. మెక్సికన్ గిటారిస్ట్ శాంతానా, కార్లోనిస్ బ్రౌన్, బ్రెజిల్ సింగర్ సాంగోలాలా తమ ఆటాపాటలతో అలరించారు.

షకీరా
అంతకుముందు సంప్రదాయ సాంబా నృత్యాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చివరలో షకీరా.. తన కొడుకు మిలన్‌ను కూడా వేదిక మీదకు తీసుకు వచ్చింది.

షకీరా
ఫుట్‌బాల్ ప్రపంచకప్ సంరంభం ఆదివారం ముగిసింది. నెలరోజులుగా జరుగుతున్న ఈ పోటీలకు ఆఖరిరోజైన ఆదివారం రియో డి జనీరో సాకర్ మైదానం సాంబా నృత్యాలు, షకీరా ఆటాపాటలతో హోరెత్తిన విషయం తెలిసిందే.

షకీరా
ఆరంభంలోనే షకీరా ‘లా లాలా' పాటతో అదరగొట్టింది. కేవలం వరల్డ్‌కప్ కోసం షకీరా రూపొందించిన ఈ పాట ఆద్యంతం అద్భుతంగా సాగింది.

షకీరా
నడుం వొంపుల వయ్యారాలతో యువతను అమితంగా ఆకట్టుకున్న షకీరా నృత్యం ఈ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ కప్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం షకీరాకి ఇది మూడోసారి.

షకీరా
హైతీకి చెందిన హిప్ హాప్ స్టార్ వేక్లెఫ్ జీన్, బ్రెజిల్ సింగర్ అలెగ్జాండ్రే పైరెస్ కలిసి ‘డర్ ఉమ్ జైటో' అంటూ పాటందుకుని స్టేడియాన్ని ఉర్రూతలూగించారు. మెక్సికో గిటారిస్ట్ కార్లోస్ శాంటనా సూపర్బ్ అనిపించాడు. ఆ తర్వాత 46 ఏళ్ల బ్రెజీలియన్ సింగర్ ఐవేటే సంగాలో తన పాటతో అలరించింది.

షకీరా
ఇక ఫైనల్ జట్లయిన అర్జెంటీనా, జర్మనీలకు చెందిన మిరుమిట్లు గొలిపే దుస్తులు ధరించిన యువతులు హొయలుపోయిన తీరు అద్భుతంగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications