బాలోటెలీకి రాణి ముద్దు లేనట్లే!: ఇటలీకి షాక్ (పిక్చర్స్)
రెసిఫీ: కోస్టారికా పైన గెలిస్తే.. బ్రిటన్ రాణి తన బుగ్గల మీద ఓ ముద్దు పెట్టాలని కోస్టారికాతో మ్యాచ్‌కు ముందు ఇటలీ స్ట్రైకర్ మారియో బాలోటెలి సరదాగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే రాణి ముద్దు అతనికి లేనట్లే! ఎందుకంటే కోస్టారికా చేతిలో ఇటలీ ఓడింది. అంతేకాదు ఈ ఓటమితో ఇటలీకి నాకౌట్ జట్టు అవకాశాలు క్లిష్టంగా మారాయి.
ఇంగ్లాండుతో జరిగిన తొలి మ్యాచులో గోల్ కొట్టిన బాలోటెలి కోస్టారికాతో జరిగిన మ్యాచులో మాత్రం రెండు గోల్ అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. మొదట బాలోటెలీ బాగానే ఆడాడని, అతనికి రెండు అవకాశాలు వచ్చాయని వాటిని ఉపయోగించుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఇంటీ కోచ్ చెప్పాడు.
కాగా, తాము గెలిచి ఇంగ్లాండు నాకౌట్స్‌కు అర్హత సాధిస్తే రాణి తనకు ముద్దు ఇవ్వాలని ఇటలీ ఆటగాడు మారియో బాలోటెల్లీ అన్న విషయం తెలిసిందే. తాము కోస్టారికాను ఓడిస్తే తనకు యుకె రాణి నుంచి తన చెంపపై ముద్దుకావాలని అతను అన్నాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

ఇటలీకి కోస్టారికా షాక్
గ్రూప్ ఆఫ్ డెత్‌లో మరో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్ ఇటలీకి కోస్టారికా ఝలక్ ఇచ్చింది. గ్రూప్-డిలో శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కోస్టారికా 1-0తో ఇటలీపై విజయం సాధించింది.

ఇటలీకి కోస్టారికా షాక్
ఈ గెలుపుతో 24 ఏళ్ల తర్వాత కోస్టారికా నాకౌట్‌కు అర్హత సాధించింది. గ్రూప్-డి నుంచి నాకౌట్‌కు వెళ్లే రెండో జట్టు ఏది అనేది ఈ నెల 24న ఉరుగ్వే, ఇటలీ మధ్య జరిగే మ్యాచ్ నిర్ణయిస్తుంది.

ఇటలీకి కోస్టారికా షాక్
మొదటి అర్ధభాగంలో 31వ నిమిషంలో బలోటెలీ మంచి అవకాశాన్ని జారవిడిచాడు. పిర్లో త్రోను అందుకున్న బలోటెల్లీ బయటకు కొట్టాడు.

ఇటలీకి కోస్టారికా షాక్
44వ నిమిషంలో జూనియర్ డియాజ్ క్రాస్‌ను బ్రియాన్ రూయిజ్ హెడ్డర్‌తో మొదటి గోల్ చేసి కోస్టారికాకు 1-0 ఆధిక్యం అందించాడు.

ఇటలీకి కోస్టారికా షాక్
రెండో అర్ధభాగంలో ఇటలీ ఆటగాళ్లు స్కోర్ చేసేందుకు దాడులను ముమ్మరం చేశారు. అయితే కోస్టారికా డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది.

ఇటలీకి కోస్టారికా షాక్
తొలి అర్ధభాగంలో రూయిజ్ చేసిన ఏకైక గోల్‌తో కోస్టారికా సంచలనం సృష్టించింది. ఈ ఓటమితో ఇటలీకి నాకౌట్ జట్టు అవకాశాలు క్లిష్టంగా మారాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications