వరల్డ్ కప్ ఫుట్ బాల్ 2010 ప్రారంభ దినాన సంగీత కచేరి ప్రపంచంలో అతి పెద్ద కచేరి కాబోతోంది. సాంగ్ సాంబను షకీరా పాడబోతోంది. ఈ కచేరీని కోట్లాది మంది టీవీలలో వీక్షించనున్నారు. జోహన్నెస్ బర్గ్ ఒర్లాండో స్టేడియం నుంచి ఈ సంగీత కచేరి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కానుంది. గురువారం షకీరా పాట సంగీత ప్రియులను అలరించనుంది.
40 వేల మంది ఒర్లాండ్ స్టేడియంలో కూర్చోవచ్చు. షకీరాను చూడడానికి సాకర్ అభిమానులు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫిఫా 2010 అధికారిక గీతం "వక వక" ను దక్షిణాఫ్రికా పాప్ గ్రూపు ఫ్రెష్ లీ గ్రౌండ్ ఆలపించనుంది. పేస్, అలిషియా కీస్, జాన్ లెజెండ్ లు కూడా అభిమానులను అలరించనున్నారు.
ఈ కచేరీలో స్ధానికులమైన తమకు ప్రాతినిధ్యం కల్పించలేదంటూ స్ధానిక సంగీత గ్రూపులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కచేరీని బహిష్కరించాలని పిలుపును ఇచ్చాయి. దీనికి స్ధానిక ప్రజలు పెద్దగా స్పందించడం లేదని తెలుస్తోంది. వామ్ అప్ మ్యాచ్ లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అసలు మ్యాచ్ లలో అటువంటీవ్ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.