Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2019 కలిసొచ్చింది: వరల్డ్‌కప్ నెగ్గిన మూడు నెలలకే ప్రగ్నెంట్!

Women’s soccer star Alex Morgan announces she is three months pregnant – just three months after World Cup win


హైదరాబాద్: యుఎస్ మహిళా సాకర్ స్టార్ అలెక్స్ మోర్గాన్‌కు 2019 సంవత్సరం కలిసొచ్చింది. 2019 వరల్డ్‌కప్ గెలిచిన మూడు నెలలకే ఆమె గర్భం దాల్చింది. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ విషయాన్ని ఆమె భర్తే స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. అలెక్స్ మోర్గాన్ భర్త కూడా పుట్‌బాలరే కావడం విశేషం.

లాస్‌ఏంజెల్స్ గెలాక్సీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న 31 ఏళ్ల సెర్వాన్డో కరాస్కోను అలెక్స్ మోర్గాన్ 2014లో వివాహమాడింది. సెర్వాన్డో కరాస్కో తన ఇనిస్టాగ్రామ్‌లో "మేము ఇప్పటికే ప్రేమలోనే ఉన్నాం. అయితే, ఆమెను ఇంకా మేము కలవలేదు. కరాస్కో కుటుంబంలో కొత్త సభ్యురాలు త్వరలోనే రాబోతుంది" అంటూ కామెంట్ పెట్టాడు.

తొలిసారి అక్కడే కలిశారు

తొలిసారి అక్కడే కలిశారు

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా గోల్డెన్ బీర్స్ జట్టు తరుపున ఆడే సమయంలో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ 2014లో వివాహామాడారు. వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో గోల్ సాధించిన తర్వాత అలెక్స్ మోర్గాన్ టీ డ్రింకింగ్ సెలబ్రేషన్ అభిమానులకు ఇప్పటికీ గుర్తే.

చాలా సంతోషంగా ఉంది

చాలా సంతోషంగా ఉంది

తాజాగా పీపుల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అలెక్స్ మోర్గాన్ మాట్లాడుతూ "మా కుటుంబాన్ని పెంచుకోవటాన్ని మేము చాలా సంతోషిస్తున్నాం. నేను అడిగిన అత్యుత్తమ ప్రపంచకప్ బహుమతి ఆమె" అని పేర్కొంది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌కు అలెక్స్ మోర్గాన్ అందుబాటులో ఉంటుందా? లేదా అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

16 మంది ప్లేయర్లలో అలెక్స్ మోర్గాన్

16 మంది ప్లేయర్లలో అలెక్స్ మోర్గాన్

2019 సంవత్సరానికి గాను బాలోన్ డీ ఓర్ అవార్డుకి నామినేట్ చేసిన 16 మంది ప్లేయర్లలో అలెక్స్ మోర్గాన్ పేరు కూడా ఉంది. యునైటెడ్ స్టేట్స్ మహిళల జాతీయ సాకర్ టీమ్(USWNT)కు ఆమె గత తొమ్మిదేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తోంది. పోర్ట్ ల్యాండ్ థోర్న్స్, ఓర్లాండో ప్రైడ్ మరియు లియోన్ జట్ల కోసం ఆమె 169 క్యాప్స్ సంపాదించడంతో పాటు 107 గోల్స్ చేసింది.

ఏప్రిల్ లేదా మే నెలలో

ఏప్రిల్ లేదా మే నెలలో

ఎందుకంటే అలెక్స్ మోర్గాన్ ఏప్రిల్ లేదా మే నెలలో బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌కు తక్కువ సమయమే ఉండటంతో ఆమె ఆడటం అనుమానంగానే ఉంది. అయితే, గతంలో ఎంతో మంది క్రీడాకారిణిలు ప్రసవించిన తర్వాత ఉన్నత స్థాయికి తిరిగి వచ్చిన ఉదాహరణలు అనేకం.

2014 సీజన్‌కు దూరమైనా

2014 సీజన్‌కు దూరమైనా

బ్రిటీష్ అథ్లెటిక్స్ స్టార్ జెస్సికా ఎన్నిస్-హిల్ గర్భవతిగా ఉన్నప్పుడు 2014 సీజన్‌కు దూరమైనప్పటికీ... ఆ మరుసటి ఏడాది జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో హెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణం సాధించింది. టెన్నిస్‌లో సెరెనా విలియమ్స్ ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అద్భుత ప్రదర్శన చేస్తోంది. 23 ఏళ్ల వయసులోనే గాయం కారణంగా కిమ్ క్లిజ్‌స్టర్స్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. అయితే, ఓ పిల్లాడికి జన్మనిచ్చిన తర్వాత తిరిగి టెన్నిస్‌ రాకెట్ పట్టి యుఎస్ ఓపెన్‌ విజేతగా నిలిచింది.

Story first published: Thursday, October 24, 2019, 15:38 [IST]
Other articles published on Oct 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+