Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత మహిళా జట్టుకే SAFF చాంపియన్ షిప్ టైటిల్

సిలిగిరి: దక్షిణాసియా ఫుట్ బాల్ సమాఖ్య (ఎస్ఎఎఫ్ఎఫ్) చాంపియన్ షిప్ టైటిల్ ను భారత మహిళా జట్టు గెలుచుకున్నది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం సాధించిన భారత జట్టు బంగ్లాదేశ్ పై 3 To 1 స్కోర్ తేడాతో కాంచన్‌జుంగా స్టేడియంలో విజయం సాధించి టైటిల్ గెలుచుకున్నది.

దీంతోపాటు భారత జట్టు వరుసగా 19 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని రికార్డు నెలకొల్పింది. 18 మ్యాచ్ ల్లో విజయం, ఒక మ్యాచ్ ఫలితాన్ని డ్రాగా ముగించింది. 12వ నిమిషంలో ప్రత్యర్థి బంగ్లాదేశ్ జట్టు గోల్ కీపర్ డైలమాలో ఉన్న సమయంలో స్ట్రయికర్ డాంగ్మీ గ్రేస్ మామూలుగా చేసిన కిక్ నేరుగా బంతిని గోల్ పోస్ట్ కు పంపింది.

మ్యాచ్ రూపురేఖలను మార్చింది

ఇదే మ్యాచ్ రూపురేఖలను నిర్దేశించింది. బంగ్లాదేశ్ ప్లేయర్లు అనుసరించిన డిఫెన్సివ్ వ్యూహం భారత్ జట్టుకు విస్త్రుత అవకాశాలు, స్పేస్ కల్పించింది. తొలి 20 నిమిషాల్లో భారత్ నాలుగు కార్నర్లు సంపాదించింది. ప్రతిసారి బాలా దేవి ద్వారా అవి లభించడం గమనార్హం. 17వ నిమిషంలో బాలా ఫ్రీ హెడ్డర్ ద్వారా పంపిన కిక్ ను స్వాధీనంచేసుకున్న కమలాదేవి నేరుగా బంతిని గోల్ పోస్ట్ దారి పట్టించినా కొద్దిలో తప్పిపోయింది.

40వ నిమిషంలో గోల్

ఈ పరిస్థితుల్లో రీ గ్రూప్ అయిన బంగ్లాదేశ్ జట్టు ప్లేయర్ సిరాత్ జహన్ షొపానా 40వ నిమిషంలో చేసిన గోల్ తో స్కోర్ సమమైంది. ఫస్టాఫ్ ముగిసిన తర్వాత భారత్ పదేపదే బంతిని వేగంగా అదుపులోకి తీసుకున్నది. ఆతిథ్య జట్టుగా బంగ్లాదేశ్ భారీస్థాయిలో ఒత్తిడి తేవడానికి ప్రయత్నించారు. అయితే వారు కౌంటర్ అటాకింగ్ కు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు.

60వ నిమిషంలో భారత జట్టుకు అవకాశం

కానీ 60వ నిమిషంలో భారత జట్టుకు తిరుగులేని అవకాశం లభించింది. రిఫరీ అభ్యంతరం వ్యక్తం చేసినా బాలాదేవి ఇన్ సైడ్ బాక్స్ వద్ద నుంచి పుష్ చేసిన బంతిని శశ్మిత మాలిక్ తెలివిగా గోల్ పోస్ట్‌కు పంపించారు. 2016లో ఎఐఎఫ్ఎఫ్ ఉత్తమ మహిళా పుట్ బాలర్ గా బాలాదేవి అవార్డు అందుకున్నారు. మిగతా 30 నిమిషాల్లో బంగ్లాదేశ్ చెలరేగిపోయేందుకు అవకాశాలున్నాయి.

ఇందుమతి పంపిన లాంగ్ షాట్ నేరుగా గోల్ పోస్ట్

కానీ చివరి ఏడో నిమిషం వరకు గోల్ పోస్ట్ వద్ద బంతిని నిలువరించిన బంగ్లాదేశ్ గోల్ కీపర్ సబీనా తర్వాత తడబడింది. దూరం నుంచి ఇందుమతి పంపిన లాంగ్ షాట్ నేరుగా గోల్ పోస్ట్ దారి పట్టింది. దీంతో భారతీయ మహిళా జట్టుకు దక్షిణాసియా పుట్ బాల్ సమాఖ్య టైటిల్ దక్కింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+