కేవలం 250 అమెరికన్ డాలర్లు(దాదాపు రూ.16,778)
మలేషియాతో మ్యాచ్‌లో మిథాలీరాజ్, థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. ఇద్దరికీ ప్రైజ్ మనీ రూపంలో 250 అమెరికన్ డాలర్లు(దాదాపు రూ.16,778) అందజేశారు. ఒక అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లో అతి తక్కువ మొత్తంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రోత్సాహకాలు ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఐపీఎల్‌లోనూ అద్బుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు, లేదా బెస్ట్ క్యాచ్, బెస్ట్ ఫీల్డర్, బౌలర్, బ్యాట్స్‌మన్‌కు కూడా కనీసం రూ.లక్ష రూపాయల చెక్ అందజేస్తున్నారని గుర్తుచేశారు.
హర్మన్ ప్రీత్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో రాణించడంతో ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు మెష్రమ్ (32), స్మృతి మందాన (29) చక్కటి శుభారంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు.
20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 66 పరుగులు
చివర్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 17 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ ఆ మాత్రం స్కోరు నమోదు చేయగలిగింది. అనంతరం 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 66 పరుగులు మాత్రమే చేయగలిగింది. హర్మన్ ప్రీత్ మూడో ఓవర్లు వేసి 11 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది.

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం
ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో మలేషియాను కేవలం 27 పరుగులకే ఆలౌట్ చేసి 142 పరుగులతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టోర్నీలో మూడో మ్యాచ్‌ను బుధవారం బంగ్లాదేశ్‌తో ఆడుతుంది.


Click it and Unblock the Notifications
