శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రమంతా ఉద్రిక్త పరిస్థితుల మధ్య సతమతం అవుతుంటే ఇద్దరు కుర్రాళ్లు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. వారిద్దరూ బాసిత్ అహ్మద్, మహ్మద్ అస్రర్. కశ్మీర్ లోయలో నాలుగు నెలలకు పైగా ఎటువంటి క్రీడా కార్యక్రమాలు లేవు. కానీ వీరిద్దరూ స్థానిక ప్రతిభతో సిఆర్‌పిఎఫ్ సాయంతో స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ జట్టు సొసైడాడ్ డెపోర్టివా జట్టులో చోటు దక్కించుకున్నారు. దీనిపై బాసిత్ అహ్మద్ మాట్లాడుతూ స్పానిష్ పుట్ బాల్ లీగ్ లో ఆడాలని తన కల అని, ఇప్పటికి తన కల సాకారమైందని పేర్కొన్నాడు.
ఇటీవల కశ్మీరీ లోయలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సిఆర్‌పిఎఫ్, స్పానిష్ ఫుట్ బాల్ సొసైడాడ్ డెపోర్టివా జట్టుతో టై అప్ అయింది. కశ్మీరీ యువతలో గల శక్తి సామర్థ్యాలను వెలికితీయాలని సంకల్పించింది.
మరింత పాజిటివ్‌గా, ఉపయోగ కరంగా కశ్మీరీ యువతను తీర్చిదిద్దేందుకు సిఆర్ పిఎఫ్, స్పానిష్ ఫుట్ బాల్ జట్లు కంకణం కట్టుకున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా బాసిత్ అహ్మద్, అర్సర్‌ల శక్తి సామర్థ్యాలు గుర్తించిన సొసైడాడ్ డెపోర్టివా యాజమాన్యం వారిని తమ జట్టులో చేర్చుకోవాలని నిర్ణయించింది. త్వరలో వారితో కాంట్రాక్ట్ ఒప్పందాలపై సంతకాలు చేయనున్నది.

'నేనెప్పుడు ఇలా స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్‌లో చోటు దక్కుతుందని ఊహించలేదు. పోటీ చాలా కష్టంగా ఉంది. బాసిత్‌కు చాన్స్ లభించడంతో నేను హ్యాపీగా ఉన్నా. నాకు కూడా అవకాశం లభించడంతో సంతోషంగా ఉంది' అని అస్రర్ అన్నాడు.
స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ యాజమాన్యం కాంట్రాక్ట్ ప్రకారం సదరు యువ క్రీడాకారుల ఖర్చులన్నీ భరిస్తుంది. ఇద్దరు కశ్మీరీ కుర్రాళ్లు స్పెయిన్ క్లబ్ సభ్యులుగా ఎన్నికైనందుకు గొప్ప ఆనందంగా ఉందని సిఆర్ పిఎఫ్ ఇన్ స్పెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ తెలిపారు.
విజయాల బా
ట కొనసాగింపే అట్లెటికో మాడ్రిడ్‌కు సవాల్
మాడ్రిడ్: లా లీగ జెయింట్స్ అట్లెటికో మాడ్రిడ్ జట్టు విజయ పథంలో ముందుకు సాగడమే తమ జట్టు ముందు ఉన్న సవాళ్లలో ప్రధానమైందని ఆ జట్టు కోచ్ డియాగో సిమ్మోన్ వ్యాఖ్యానించాడు. ఇది గతేడాది చివరి సీజన్‌లో రుజువైందన్నాడు. ఇంతకుముందు లాస్ పాల్మాస్ జట్టుతో జరిగిన మ్యాచ్ ఫలితమే దీనికి నిదర్శనమని చెప్పాడు. ఒకే నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆటతీరు ప్రదర్శించడమే తమ ముందు ఉన్న సమస్య అని వ్యాఖ్యానించాడు. మిగతా జట్లు తమ ప్రతిభా పాటవాలు మరింత మెరుగు పర్చుకున్నాయని తెలిపాడు.