మురికి షెడ్లా.. మరుగుదొడ్లా.. ?: ఫుట్‌బాల్ క్రీడాకారుల దుస్థితి (ఫొటోలు)
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఫుట్‌బాల్ క్రీడకు కర్ణాటక స్టేడియంలో ఆదరణ లోపించింది. ఈ క్రీడలో ప్రసిద్ధి చెందిన క్రీడాకారులు వేల కోట్లలో జీతాలు తీసుకొని లగ్జరీ లైఫ్ స్టైల్ గడుపుతుంటే బెంగుళూరు ఫుట్‌బాల్ స్టేడియం కనీస అవసరాలను సైతం సమకూర్చలేకపోతోంది.

మరుగుదొడ్ల దుస్థితి:
ప్రభుత్వ మరుగుదొడ్లు సైతం కొత్తగా రూపుదిద్దుకొంటున్న నేపథ్యంలో ఫుట్‌బాల్ క్రీడాకారలకు మాత్రం ఏ డ్రైనేజినో తలపించే విధంగా స్టేడియంలోని మరుగుదొడ్లు దర్శనిమిస్తున్నాయి.

సగం విరిగిన తలుపులతో:
ఈ రెస్ట్ రూమ్‌ల పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే తలుపులు కూడా సగం విరిగి అట్టలు అడ్డుపెట్టుకున్నట్టు ఉంది పరిస్థితి. కొన్నింటికైతే అసలు తలుపులే లేవు.

నీటి గొట్టాలకు పెద్ద రంధ్రాలు:
పురాతన భవనం మాదిరిగా తయారైన ఆ చోటు నీరు వచ్చే పంపు భాగం చుట్టు పక్కల కూడా పెద్ద పెద్ద రంధ్రాలతో కూడి ఉంది. వాటి గుండా ఏమైనా రావచ్చనే ప్రమాదమూ లేకపోలేదు.

వెచ్చించిన నిధులు ఇలా..:
పది క్లబ్‌ల వరకు కలిసి పాల్గొంటున్న ఈ ఐఎస్ఎల్ లీగ్ లో 48.85 కోట్ల రూపాయలను కేటాయించారు. అన్ని జట్లు కలిపి మొత్తం 156 మంది క్రీడాకారులు ఉన్నారు. ఈ మొత్తం నుంచి కర్ణాటకలోని బెంగుళూరు ఫుట్‌బాల్ క్రీడాకారులైన 17మందికి 6.01 కోట్ల రూపాయలు ఇచ్చింది.

క్రీడాకారుడి ఆవేదన:
సంతోష్ ట్రోఫీ జట్టు తరపు ఆటగాడైన రాజ్ కిరణ్ అనే క్రీడాకారుడు ఇక్కడి దుస్థితి గురించి ఇలా పేర్కొన్నాడు. ఐదేళ్లుగా ఈ పరిసరాలు ఇలానే ఉన్నాయి. ఏదైనా అవసరం పడితే దురదృష్టవశాత్తు వీటినే వాడుకోవాలి. మహిళలకైతే ఇక్కడ ప్రత్యేక సౌకర్యం అంటూ ఏమీ లేదు. ఎవరైనా ఈ అగచాట్లు పడాల్సిందే. అని ఆవేదన పడ్డాడు.

చేస్తూనే ఉన్నాం.
దీనికి స్పందించిన యాజమాన్యం.. ఈ మధ్యనే టాయ్‌లెట్స్‌ని మార్చాం. ఒకొక్కటిగా నిదానంగా అన్ని సర్దుబాట్లు చేస్తాం. మున్మందుకు చక్కని వాతావరణాన్ని నెలకొల్పుతామని అభిప్రాయపడింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications