న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

కుమార్తె పెదాలను ముద్దాడిన సాక‌ర్ స్టార్‌!

why would a father kiss his daughter on the lips? questioned netizens

లెహార్వే: ఇంగ్లండ్ సాకర్ దిగ్గ‌జం డేవిడ్ బెక్‌హామ్‌ మ‌రోసారి విమ‌ర్శ‌ల‌కు గుర‌య్యాడు. ఏడేళ్ల త‌న కుమార్తె పెదాల‌పై ముద్దు పెట్ట‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. దీనిపై మిశ్ర‌మ స్పంద‌న కూడా వ‌స్తోంది. కుమార్తెల‌పై త‌ల్లిదండ్రులు ఒక్కొక్క‌రు ఒక్కోర‌కంగా త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తుంటార‌ని, దీన్ని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు మ‌రికొంద‌రు.

ఫ్రాన్స్‌లోని లెహ‌ర్వేలో క‌నిపించిన ఈ దృశ్యాన్ని క్లిక్ మ‌నిపించారు అభిమానులు. మ‌హిళల‌ ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ప్ర‌స్తుతం న‌డుస్తోంది. ఫ్రాన్స్ ఈ టోర్న‌మెంట్‌కు ఆతిథ్య‌మిచ్చింది. గురువారం లెహార్వే స్టేడియంలో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మ‌హిళ‌ల ఫుట్‌బాల్ టీమ్‌.. నార్వేను ఢీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. 3-0 గోల్స్ తేడాతో నార్వేను ఓడించి..సెమీ ఫైన‌ల్స్‌కు చేరుకుంది.

ఈ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా తిల‌కించ‌డానికి బెక్‌హామ్ త‌న ఏడేళ్ల కుమార్తె హార్ప‌ర్‌తో క‌లిసి ఫ్రాన్స్‌కు వెళ్లాడు. లెహార్వే స్టేడియంలో ప్రేక్ష‌కుల మ‌ధ్య‌న కూర్చుని మ్యాచ్‌ను వీక్షించాడు. త‌న దేశ జ‌ట్టు నార్వేను ఓడంచి, ఫైన‌ల్స్‌కు చేర‌డంతో ఆనందంలో మునిగిపోయాడు బెక్‌హామ్‌. త‌న ఆనందాన్ని కుమార్తె హార్ప‌ర్‌తో పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆమె పెదాల‌పై ముద్దు పెట్టాడు.

దీనిపై సోష‌ల్ మీడియాలో మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. బెక్‌హామ్ చ‌ర్య‌ను కొంద‌రు త‌ప్పుప‌డుతుండ‌గా.. మ‌రికొంద‌రు దాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం లేద‌ని కొట్టి ప‌డేస్తున్నారు. ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తుంటార‌ని అంటున్నారు. బెక్‌హామ్‌కు త‌న కుమార్తె హార్ప‌ర్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, అందుకే- తాను ఎక్క‌డికెళ్లినా కుమార్తెను వెంట‌బెట్టుకుని వెళ్తుంటాడ‌ని చెబుతున్నారు.

Story first published: Friday, June 28, 2019, 15:25 [IST]
Other articles published on Jun 28, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X