Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సాకర్ కప్: ఈజిప్టు జట్టుకు కెప్టెన్‌గా సలాహ్!!

Mohamed Salah

బెంగళూరు: ఫిఫా వరల్డ్ కప్‌కు 28 ఏళ్ల తర్వాత ఈజిప్టు అర్హత సాధించింది. చివరిసారిగా 1990లో ఇటలీలో జరిగిన టోర్నమెంట్‌లో చివరిసారిగా ఈజిప్టు సాకర్ టోర్నీలో పాల్గొన్నది. తిరిగి తాజాగా రష్యాలో వచ్చేనెలలో జరుగనున్నవరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు ఈజిప్టు టీమ్ సిద్ధమవుతున్నది. రష్యాలో జరిగే టోర్నీలో ఈజిప్టు జట్టుకు లివర్ పూల్ స్టార్ ప్లేయర్ మహ్మద్ సాలేహ్ సారథ్యం వహించనున్నాడు.

జూన్ 14వ తేదీ నుంచి రష్యాలో ప్రారంభమయ్యే 21వ ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ఏ గ్రూపులో ఉరుగ్వే, ఈజిప్టులతోపాటు ఆతిథ్యం ఇస్తున్న రష్యా, సౌదీఅరేబియా ఆడుతున్నాయి. జూన్ 15వ తేదీన ఉరుగ్వే టీంతో ఈజిప్టు తలపడనున్నది. ఈ సందర్భంగా మొహమ్మద్ సలాహ్ మాట్లాడుతూ 'మేం 28 ఏళ్లుగా ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో పాల్గొనలేదు. కానీ తాజాగా సాధించిన అర్హతతో ఈజిప్టులో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టోర్నీలో మెరుగైన ఆటతీరు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాం' అని చెప్పాడు.

 లివర్‌పూల్‌లో సలాహ్ అజేయమైన ప్రతిభ

లివర్‌పూల్‌లో సలాహ్ అజేయమైన ప్రతిభ

ఛాంపియన్స్ లీగ్‌లో లివర్ పూల్ క్లబ్ జట్టు తరఫున అజేయమైన ప్రతిభ కనబర్చిన మొహమ్మద్ సలాహ్.. ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అనే టైటిల్‌ను రెండుసార్లు గెలుచుకున్నాడు. అన్ ఫీల్డ్‌లో తొలి సీజన్‌లోని అన్ని టోర్నమెంట్లలో 43 గోల్స్ సాధించాడు. లివర్ పూల్ టీం జట్టును ఛాంపియన్స్ లీగ్ ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. 2022 వరకు లివర్ పూల్ క్లబ్ యాజమాన్యంతో కాంట్రాక్టు చేసుకున్న మొహమ్మద్ సలాహ్‌ పలు రికార్డులు సాధించాడు. అయితే మొహమ్మద్ సలాహ్‌ను తమ జట్టులో చేర్చుకునేందుకు లా లీగ జెయింట్స్ రియల్ మాడ్రిడ్ ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి.

రికార్డుల సాధనపై సలాహ్ ఇలా..

రికార్డుల సాధనపై సలాహ్ ఇలా..

మొహమ్మద్ సలాహ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘నేను చాలా సంతోషంగా ఉన్నా. చాలా ఫైన్‌గా ఉన్నా. లివర్‌పూల్ జట్టు తరఫున ఆడుతూ గొప్ప రికార్డులు సాధించాలని భావిస్తున్నా. ఛాంపియన్స్ లీగ్ టోర్నీలో జట్టును ఫైనల్స్‌కు చేరుకున్నా' అని తెలిపాడు. మే 26వ తేదీన చాంపియన్స్ లీగ్ టోర్నమెంట్‌లో రియల్ మాడ్రిడ్ జట్టుతో తలపడనున్నది. ప్రస్తుత సీజన్‌లో వింగర్ సాడియో మనే, స్ట్రైకర్ రాబర్ట్ ఫిర్మినోలతోపాటు లివర్ పూల్ టీం సక్సెస్‌లో మొహమ్మద్ సలాహ్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఈ ఏడాది మరిచిపోలేని రోజని మహ్మద్ సాలేహ్ చెప్పాడు.

 రియల్‌మాడ్రిడ్ తోనే పోటీ అంటోన్న సలాహ్‌

రియల్‌మాడ్రిడ్ తోనే పోటీ అంటోన్న సలాహ్‌

‘మేం వచ్చే ఏడాది చాంపియన్స్ లీగ్ టోర్నీలో చాలా తేలిగ్గా ఆడతాం. మాంచెస్టర్ సిటీ, రోమా వంటి అగ్రశ్రేణి జట్లతో మేం పోటీ పడతాం వచ్చే సీజన్‍లోనూ చాంపియన్స్ లీగ్ టోర్నీకి అర్హత సాధిస్తాం' అని చెప్పాడు. ‘మేం రియల్ మాడ్రిడ్ జట్టుతో పోటీ పడుతున్నాం' అని తెలిపాడు.

 ప్రీమియర్ లీగ్ టోర్నీలో సాలేహ్ సరికొత్త గోల్స్ రికార్డు

ప్రీమియర్ లీగ్ టోర్నీలో సాలేహ్ సరికొత్త గోల్స్ రికార్డు

లివర్ పూల్ ప్లేయర్ మహ్మద్ సాలేహ్ తాజాగా గోల్స్ కొట్టడంలో రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం సాగుతున్న ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఒకే సీజన్‌లో 38 గోల్స్ చేశాడు. ఆదివారం బ్రిగ్టోన్ జట్టు పెనాల్టీ ఏరియా నుంచి గోల్ సాధించాడు. దీంతో బ్లాక్ బర్న్ జట్టు తరపుణ 1995 - 96లో అలన్ షేరర్, 2007 - 08లో మాంఛెస్టర్ యునైటెడ్ తరఫున క్రిస్టియానో రొనాల్డో, 2013 - 14లో లివర్ పూల్ ప్లేయర్ లూయిస్ సూరెజ్ సాధించిన రికార్డులతో సమం చేశాడు. మహ్మద్ సాలేహ్ అన్ని టోర్నీల్లో కలిపి 51 మ్యాచ్‌ల్లో పాల్గొని 44 గోల్స్ సాధించాడు. 1993 - 94లో న్యూ క్యాస్టిల్ జట్టు ప్లేయర్ షేరర్, మాంఛెస్టర్ యునైటెడ్ ఆటగాడు ఆండీ కోల్ సంయుక్తంగా 42 మ్యాచ్‌ల్లో 34 గోల్స్ చేసి రికార్డు నెలకొల్పాడు.

Story first published: Wednesday, May 23, 2018, 14:02 [IST]
Other articles published on May 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+