
రష్యా సాకర్ టోర్నీలో అర్జెంటీనా ఫేవరెట్ కాదు
‘అర్జెంటీనా వాసులు తమ జట్టు రష్యా సాకర్ కప్ టోర్నమెంట్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగడం లేదన్న సంగతి తెలుసుకోవాలి. కానీ మా జట్టులో మంచి ఆటగాళ్ల గ్రూపు ఉన్నది. మేం వారితో ముందుకెళుతున్నాం. అర్జెంటీనా టైటిల్ గెలుచుకునే అవకాశంపై వాస్తవ పరిస్థితులను బట్టి వ్యవహరించాలి' అని మెస్సీ వ్యాఖ్యానించాడు.

పలు టైటిళ్లను సాధించిన లియానెల్ మెస్సీ
నమ్ముతాను, నాకు విశ్వాసం ఉంది. జట్టుపై విశ్వాసం ఉంది. ప్రతిభావంతులైన, అనుభవం గల ఆటగాళ్లతో రష్యాకు వెళుతున్నాం. కానీ రష్యాకు వెళ్లే మా జట్టు ఉత్తమ ప్లేయర్లతో కూడిందన్న సంకేతం ఇవ్వడం సరికాదు' అని తెలిపాడు. పలు దఫాలు చాంపియన్స్ లీగ్, క్లబ్ వరల్డ్ కప్ టైటిళ్లను బార్సిలోనా క్లబ్ జట్టుకు ఒంటిచేత్తో గెలిచి సాధించిన నేపథ్యం లియానెల్ మెస్సీది. కానీ ప్రపంచ కప్ టైటిల్‌కు ఇతర టైటిళ్లకు తేడా ఉన్నదన్నాడు.

అర్జెంటీనా తరఫున ఆడేందుకే మెస్సీ ప్రాధాన్యం
ఎల్లవేళలా అర్జెంటీనా జట్టు తరఫున ఆడడానికే ప్రాధాన్యం ఇస్తానని లియానెల్ మెస్సీ తెలిపాడు. రష్యాలో జరిగే సాకర్ సంరంభంలో అర్జెంటీనా ఆతిథ్య జట్టు రష్యా, ఐస్‌లాండ్, క్రొయేషియా జట్లతో అర్జెంటీనాతో తలపడనున్నది. ఐస్‌లాండ్ జట్టు మాత్రమే సంక్లిష్ఠంగా ఉటుందని చెప్పాడు లియానెల్ మెస్సీ. మిగతా జట్లతో పోటీ పడగలమని తెలిపాడు. నైజీరియా జట్టు ఎల్లవేళలా తమ జట్టుకు కష్టతరమైందన్నాడు. నైజీరియా జట్టుపై గత నవంబర్‌లో క్రాన్సోడార్‌లో జరిగిన మ్యాచ్‌లో 4 - 2 స్కోర్ తేడాతో విజయం సాధించాడు.

ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపొందితేనే అర్జెంటీనా ముందడుగు
వరల్డ్ కప్ టోర్నీలో అర్జెంటీనా, ఇతర జట్లు నాలుగు దఫాలు పోటీ పడాల్సి ఉంటుంది. కనీసం ప్రతి మ్యాచ్‌లోనూ అర్జెంటీనా ఒక్క గోల్ సాధించి గెలుపొందాల్సి ఉంటుంది. క్రొయేషియా జట్టుతో పోలిస్తే స్పెయిన్ జట్టు ప్లేయర్లకు బంతిపై నియంత్రణ ఉంటుందని లియానెల్ మెస్సీ చెప్పాడు. మిడ్ ఫీల్డర్ల ఆటతీరులో ఎంతో నాణ్యత ఉంటుందని పేర్కొన్నాడు. ‘ఈ గ్రూపులో జట్లపై ఆడి గెలుపొందగలమని ఆలోచిస్తున్నాం. కానీ అంత తేలిక కాదు' అని లియానెల్ మెస్సీ వ్యాఖ్యానించాడు. ప్రపంచకప్ టోర్నమెంట్ ప్రారంభయ్యేలోగా అర్జెంటీనా రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో పాల్గొననున్నది.


Click it and Unblock the Notifications


