'తొలి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించడమే లక్ష్యం'
కోల్‌కతా: ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఐ లీగ్ పదవ ఎడిషన్ తొలి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమని మొహున్ బగన్ కోచ్ సంజయ్ సేన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. 'తొలి మూడు మ్యాచ్‌ల్లో పాయింట్లు పెంచుకోవడమే తమ లక్ష్యం. దీనివల్ల తదుపరి లీగ్ మ్యాచ్‌ల్లో ముందడుగు వేసేందుకు వీలవుతుంది' అని అన్నాడు.
గత ఏడాది చాంపియన్ షిప్ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయిన మొహున్ బగన్ కోచ్ సంజయ్ సేన్ ఈ దఫా ఐ లీగ్ టోర్నీని గెలుచుకోవడమే లక్ష్యమన్నాడు. అందుకు తాము చాలా కష్ట పడాల్సి ఉన్నదని, అంత సజావుగా సాధ్యం కాదని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు.

కోల్ కతాలో పంజాబ్ జట్టుతో మొహున్ బగన్
ఆదివారం నాడు చర్చిల్ బ్రదర్స్, ఈ నెల 13న షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్ సి, 17న మినర్వ పంజాబ్ జట్టుతో మొహున్ బగన్ జట్టు కోల్ కతాలో తలపడుతుంది. డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు ఎఫ్‌సితోపాటు ఈస్ట్ బెంగాల్ జట్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని అంచనావేస్తున్నామన్నాడు. కొత్తగా లీగ్ లో చేరిన చెన్నై సిటీ ఎఫ్ సి, మినర్వ పంజాబ్ ఎఫ్ సి, ఐజ్వాల్ లాజోంగ్ ఎఫ్ సి వంటి జట్లు తమకు పోటీయే కాదన్నాడు.

పటిష్టంగా ఉన్న మొహున్ బగన్
2016 ఎఐఎఫ్ఎఫ్ ప్లేయర్ అవార్డు గ్రహీత జెజె లాల్ఫెఖ్లౌ ఆధ్వర్యంలో సోనీ నోర్డే, జపానీస్ ఫార్వర్డ్ ప్లేయర్ యుసా కస్తుమి వంటి అద్భుతమైన జంట దన్నుతో తమ జట్టు పటిష్టంగా ఉన్నదని తెలిపాడు. వీరికి తోడు కేరళ వాసి అయిన ఢిల్లీ డైనమోస్ డిఫెండర్ అనాస్ ఎడాథోడికా తమ జట్టుకు అదనపు బలమని పేర్కొన్నాడు. తమ జట్టు సభ్యుల్లో అందరూ స్ఫూర్తిదాయక ప్రతిభ కలవారేనన్నాడు.

11 మంది సామర్థ్యం ఉన్నవారే
‘మొత్తం 22 మంది ఆటగాళ్లు సవాలే. వారంతా తొలి 11 మంది జట్టులో ఆడగల సామర్థ్యం ఉన్నవారే. మొహున్ బగన్ వంటి పెద్ద జట్టు కోచ్ గా నా బాధ్యత సవాళ్లతో కూడుకున్నది. ఒకవేళ టైటిల్ గెలుచుకోవడంలో విఫలమైతే కోచ్ గా వచ్చిన దారిలోనే వెనుదిరిగి వెళతాను' అని సంజయ్ సేన్ స్పష్టం చేశాడు. వైఫల్యాలను అంగీకరించే సామర్థ్యం, నైతిక స్థైర్యం తనకు ఉన్నాయన్నాడు. భారతీయ ఆటగాళ్లు చాలా మంచి వారని తెలిపాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తరఫున ఆడిన తనకు మొహున్ బగన్ సారథి యుసా కస్తుమితో రెండు మ్యాచ్‌ల్లో ఆడానని, చాలా శక్తి సామర్థ్యాలు గల ఆటగాడని చెప్పాడు.

జట్టు మంచి లైనప్‌ను కలిగి ఉంది
ఇటీవలే ముగిసిన ఐఎస్ఎల్ టోర్నీలో ఎఫ్ సి పుణె సిటీ తరఫున ప్రాతినిథ్యం వహించిన బ్రెజిల్‌కు చెందిన సెంటర్ బ్యాక్ ఎడుయారో ఫెర్రీరాతోపాటు డార్రీ డఫ్పీ విదేశీ ఆటగాళ్లుగా మంచి లైనప్ కలిగి ఉన్నారని చెప్పాడు. దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా, థాయిలాండ్, ఇరాన్ దేశాల జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించిన ఫెరీరా యువకుడిగా ఫ్లుమినెస్, ఫ్లామెంగో, కొరియాంథైన్స్ జట్లలో ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications