న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

వంద గంట‌లు జీతం లేకుండా పనిచేయి: రూనీకి శిక్ష ఖరారు చేసిన కోర్టు

తప్ప తాగి కారు న‌డిపిన కేసులో ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ఆటగాడు వేన్ రూనీకి సోమవారం స్టాక్‌పోర్ట్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువ‌రించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: తప్ప తాగి కారు న‌డిపిన కేసులో ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ఆటగాడు వేన్ రూనీకి సోమవారం స్టాక్‌పోర్ట్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువ‌రించింది. సెప్టెంబర్ ఒకటవ తేదీన తాగి కారు న‌డిపించాడనే ఆరోప‌ణ‌ల‌పై అత‌న్ని అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ కేసుకు సంబంధించి తాను తాగి కారు డ్రైవ్ చేసిన‌ట్లు ఇంగ్లాండ్ పుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ రూనీ ఒప్పుకున్నాడు. దీంతో ఈ కేసులో కోర్టు తీర్పు వెలువ‌రించింది. రూనీపై రెండేళ్ల డ్రైవింగ్ నిషేధం విధించడంతో పాటు మ‌రో వంద గంట‌లు జీతం లేకుండా ప‌నిచేయాల‌ని కోర్టు అత‌నికి శిక్ష‌ను ఖ‌రారు చేసింది.

Wayne Rooney banned after admitting drink-driving

అసలేం జరిగింది?

సెప్టెంబ‌ర్ ఒక‌ట‌వ తేదీన చెషైర్‌లోని బబుల్ రూమ్ బార్‌లో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మాజీ సహచరుడు ఫిల్ బార్డ్‌లే తో పార్టీ చేసుకున్నాడు. పార్టీ అనంతరం తిరిగి వస్తున్న స‌మ‌యంలో చెషైర్‌లోని త‌న ఇంటి ద‌గ్గ‌ర పోలీసులు అత‌ని కారు ఆపారు. అప్పుడు అత‌ను తాగి కారు డ్రైవ్ చేస్తున్న‌ట్లు తేలింది.

ఇదే కేసులో మెజిస్ట్రేట్ కోర్టు 170 పౌండ్ల జ‌రిమానా కూడా విధించింది. తాగి కారు న‌డిపినందుకు రూనీ క్ష‌మాప‌ణ‌లు తెలిపాడు. 'నేను త‌ప్పు చేశాను, కోర్టు తీర్పును గౌర‌విస్తాన‌ు' అని కోర్టు బయటికి వచ్చిన అనంతరం మీడియాతో అన్నాడు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ త‌ర‌ఫున 119 మ్యాచ్‌లాడిన రూనీ.. 53 గోల్స్‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X