న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ముస్లిం యువతులు ఫుట్‌బాల్ ఆటను చూడటం హరాం (నిషిద్ధం)

Watching football is haram? Muslim cleric says women shouldn't watch 'men playing with bare knees'

హైదరాబాద్: ముస్లిం యువతులపై మరో ఫత్వా జారీ అయింది. డియోబాండ్‌కు చెందిన ముఫ్తీ అతర్ ఖస్మీ ఫుట్‌బాల్ ఆటను చూడొద్దంటూ ముస్లిం యువతులపై ఆంక్షలు విధించారు. ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో మోకాళ్ల పైకి నిక్కర్లు ధరించి ఆడుతుంటారు కాబట్టి వారిని చూడొద్దంటూ వారించారు.

ఇది ఈ మధ్యనే చెప్పిన విషయమేమీ కాదు. ఇది 2015లో జరిగిన సమావేశంలోని వీడియో. ఈ మధ్యనే ఇది వైరల్ అవుతుండటంతో విషయం గురించి పలు వివాదాలు చెలరేగుతున్నాయి. దీనికి అనుగుణంగా సౌదీ ఆరేబియా ప్రభుత్వం కూడా ఇలాంటి ఫత్వానే మరొకటి జారీ చేసింది.

ప్రత్యక్ష ప్రసారం అయినా రికార్డెడ్ వీడియో అయినా వీక్షించడం నిషిద్ధం అంటూ వీడియోలో పేర్కొన్నారు. ఆట జరుగుతుండగా మగవాళ్లు ధరించే కురచ దుస్తులు చూసి ఆకర్షితులవుతారని అందుకే చూడకూడదని వ్యాఖ్యానించారు. ఇంకా ఎవరైతే వారి భార్యలను ఫుట్‌బాల్ చూస్తుండగా వారించకుండా ఉంటారో వారికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. మీకు దేవుడంటే భయం లేదా అని వాగ్ధాటించారు.

ముస్లిం యువతులపై హజారీ ఇలా ఫత్వాలు జారీ చేయడం మొదటిసారి కాదు. ఇంతకుముందు డ్రైవింగ్ చేయొద్దని, వెంట్రుకలు పీక్కోవడం, ట్రిమ్మింగ్ చేసుకోవడం, కనుబొమ్మలు షేపింగ్ చేసుకోవడం వంటివి ముస్లిం వ్యతిరేకం అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాక ఇలాంటి పనులన్నీ చేసే బ్యూటీపార్లర్లకు దూరంగా ఉండాలని తెలిపారు.

Story first published: Monday, January 29, 2018, 12:50 [IST]
Other articles published on Jan 29, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X