Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బోణీ అదిరింది!: ప్రొఫెషనల్ సాకర్ ప్లేయర్‌గా బోల్ట్ రెండు గోల్స్ (వీడియో)

Watch Usain Bolt Score His First Two Goals as a Professional Soccer Player

హైదరాబాద్: గ్రేటెస్ట్ స్ప్రింటర్‌గా పేరుతెచ్చుకున్న ఉసేన్ బోల్ట్ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అథ్లెటిక్స్‌ నుంచి రిటైర్‌ అయిన అనంతరం ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఉసేన్ బోల్ట్ శుక్రవారం తన తొలి మ్యాచ్‌ ఆడాడు.

ఆస్ట్రేలియాలోని సెంట్రల్‌ కోస్ట్‌ మరైనర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బోల్ట్‌ ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిశాడు. ఈ సీజన్‌ ఆరంభానికి ముందు మకార్థర్‌ సౌత్‌ వెస్ట్‌ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 55వ, 69వ నిమిషంలో రెండు గోల్స్ కొట్టాడు. గోల్స్ చేసిన అనంతరం 'లైటినింగ్‌ బోల్ట్‌' భంగిమతో సంబరాలు చేసుకుని అభిమానులను అలరించాడు.

ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మకార్థర్‌ సౌత్‌ వెస్ట్‌ యునైటెడ్‌ జట్టుపై బోల్ట్‌ జట్టు 4-0తో ఘనవిజయం సాధించింది. ఈ ఏడాది ఆగస్ట్ 31న ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ లీగ్ ఏ-లీగ్‌లో సెంట్రల్ కోస్ట్ మెరైనర్స్ క్లబ్‌‌ తరఫున ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, October 13, 2018, 16:59 [IST]
Other articles published on Oct 13, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+