Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుర్రాడు దుమ్ములేపాడు: ఫుట్‌బాల్‌తో ఫీట్ చేసిన కేరళ మెస్సీ..వీడియో వైరల్

Watch:This twelve year kid is now a social media sensation, lauded as Kerala Messi

కరోనావైరస్ కారణంగా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిన నేపథ్యంలో అన్ని రంగాలు నష్టాల బాట పట్టాయి. ఇక క్రీడారంగం కూడా అదే బాటలో నడుస్తోంది. కొన్ని ముఖ్యమైన రంగాలకు ఆయా దేశ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా... క్రీడా రంగంకు మాత్రం అనుమతులు ఇవ్వలేదు. దీంతో భారీ టోర్నమెంట్లు అన్నీ అయితే రద్దు కావడం కానీ లేదా వాయిదా పడటం కానీ జరిగాయి. దీంతో చాలా మంది క్రీడాకారులు తమ ఇళ్లకే పరిమితమయ్యారు.

ఇళ్లల్లోనే ఉంటూ పలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో వారు ఇళ్లల్లోనే క్రికెట్ ఆడుతున్న వీడియోలు, ఇళ్లల్లో ఉండి వంట చేస్తున్న వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక క్రీడాకారుల వ్యవహారం ఇలా ఉంటే మరికొందరు తమ అభిమాన స్టార్స్‌ను ఇమిటేట్ చేస్తూ వారికి మేమేమీ తక్కువకాదంటూ ఫీట్లు చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడు మనదేశంలో కూడా ఓ వీడియో వైరల్ అవుతోంది.

కేరళ మెస్సీ చూడండి

కేరళ రాష్ట్రం మల్లాపురంకు చెందిన 12 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు ఇంటర్నెట్ స్టార్ అయ్యాడు. అతను చేసిన ఫీట్‌ను చూస్తే మీరు వావ్ అనకుండా ఉండలేరు. ఈ కుర్రాడు ఫుట్‌బాల్‌తో ఈ ఫీట్ చేశాడు. నిజంగానే ఈ పిల్లాడి ఫీట్ చూస్తే సాకర్ స్టార్ మెస్సీ కూడా మురిసిపోవాల్సిందే. ఇంతకీ ఈ కుర్రాడు చేసిన ఫీట్ ఏంటో తెలుసా..? ఓ గోల్‌పోస్టుకు ఒక రింగ్ హ్యాంగ్ చేశాడు. గోల్‌పోస్టుకు దూరంగా ఫుట్‌బాల్ ఉంచాడు.

ఇక గోల్‌పోస్టుకు వేలాడదీసిన రింగ్‌ లక్ష్యంగా ఆ బంతిని కొట్టి సక్సెస్ అయ్యాడు. ఇంతకీ ఆ బాలుడు మెస్సీ జెర్సీ ధరించాడు కాబట్టే కుర్రాడిలో ఆ స్టార్ సాకర్ ప్లేయర్ ఆవహించినట్టున్నాడు. ఇక మెస్సీ ఆహార్యాన్ని అలానే దించి ఆకట్టుకున్నాడు. అంటే మెస్సీ ఎలాగైతే తన నడుముపై చేతులు పెట్టుకుంటాడో అలానే పెట్టుకుని బంతిని కొట్టే ముందు తల వెంట్రుకలను ఎలా అయితే మెస్సీ సర్దుకుంటాడో అలానే సర్దుకుని మొత్తం మెస్సీ మేనరిజాన్ని దించేశాడు.

మెస్సీని అనుకరించిన కుర్రాడు

మెస్సీని అనుకరించిన కుర్రాడు

సాధారణంగా ఫ్రీకిక్‌ సమయంలో ఈ అర్జెంటీనా స్టార్ ప్లేయర్ బంతి ముందు నిల్చున్నాడంటే అవతర గోల్‌కీపర్‌ హడలెత్తాల్సిందే అన్నట్లుగా ఉంటుంది. మెస్సీ మొత్తం తన కెరియర్లో 697 గోల్స్ సాధించగా అందులో 52 ఫ్రీ కిక్స్ ద్వారా సాధించాడు. ఇక మన స్టోరీలో కుర్రాడు చేసిన ఈ ఫీట్ ముందుగా ఆల్ కేరళ సెవెన్స్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఫేస్‌బుక్‌ పేజ్‌పై వీడియోను పోస్టు చేయడం జరిగింది. ఇక ఈ వీడియో వివిధ సోషల్ మీడియా వేదికలపై చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజెన్లు మెస్సీతో ఈ కుర్రాడిని పోల్చుతుండటం విశేషం.

ప్రభుత్వ స్కూల్‌లో చదువుకుంటున్న కేరళ మెస్సీ

ప్రభుత్వ స్కూల్‌లో చదువుకుంటున్న కేరళ మెస్సీ

ఇంతకీ ఈ కుర్రాడి పేరు చెప్పనేలేదు కదూ. ఫుట్‌బాల్‌ను ఒక రింగ్‌లోకి షూట్ చేసిన ఈ బాలుడి పేరు మిషాల్ అబోలైస్. కేరళలోని కట్టుముందలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. తన అన్న ప్రోత్సహించడంతో సాకర్‌పై దృష్టి సారించి గత నాలుగేళ్లుగా కోచింగ్ తీసుకుంటున్నాడు మిషాల్. ఇక ఈ వీడియోను మిషాల్ సోదరుడు వాజిద్ తీశాడు. ఇక అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు ఈ కుర్రాడు. మెస్సీని ఎంతో అభిమానిస్తానని చెప్పిన మిషాల్.. ఆ తర్వాత క్రిస్టియానో రొనాల్డో అంటే చాలా ఇష్టమని వెల్లడించాడు.

Story first published: Thursday, May 7, 2020, 18:23 [IST]
Other articles published on May 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+