Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫుట్ బాల్: మెస్సీని, రొనాల్డొలను గుర్తుకు తెస్తున్న మణిపూర్ ఆటగాడు(వీడియో)

Watch this AMAZING goal by Nongdamba Naorem for Indian Arrows

హైదరాబాద్: మణిపూర్ ఫుట్‌బాల్ ఆటగాడు నాన్‌దంబా విదేశీ ఆటగాళ్లను మరిపించే స్థాయిలో తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తన ప్రతిభకు మెచ్చిన నరేంద్ర మోడీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో నాందంబా ఫోటోను పోస్ట్ చేశారు.

ఫిఫా అండర్-17లో అసమాన ప్రతిభను చూపిన నాన్‌దంబా భారత జాతీయ ఫుట్‌బాల్ టీంకు సెలక్టయ్యాడు. యూఎస్‌ఏ, ఘనా, కొలంబియా దేశాలతో జరిగిన అండర్-17ప్రపంచ కప్‌లో భారత్ జట్టు ఓడిపోకుండా కాపాడిన ఆటగాడిగా పేరొందాడు.

ప్రస్తుతం 2017-2018కి గాను ఐ-లీగ్ జరుగుతుంది. దీనికి గాను భారత్ తరపున నాన్‌దంబా సెలక్టయ్యాడు. డిసెంబరు 26 మంగళవారం న్యూ ఢిల్లీలోని అంబేద్కర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో షిల్లాంగ్ లాజొంగ్‌తో తలపడి భారత్ 3-0తేడాతో గెలుపొందింది.

ఫుట్‌బాల్ అంటేనే లియోనల్ మెస్సీ, క్రిస్టియన్ రొనాల్డొ వంటి విదేశీ ఆటగాళ్లతో పోల్చుకుని చూసుకునే రోజుల్లో భారత ఆటగాడైన నాన్‌దంబా ఖచ్చితంగా గుర్తుండిపోతాడు. జితేంద్ర సింగ్ అనే మరో యువ ఆటగాడు కూడా ఒక గోల్ చేసి భారత్ స్కోరులో భాగమైయ్యాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 27, 2017, 10:11 [IST]
Other articles published on Dec 27, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+