న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

అభిమాని అడిగాడని చొక్కా తీసి ఇచ్చేశాడు (వీడియో)

Watch Neymar handing over jersey to a young pitch invader!

పారిస్: పారిస్ సెయింట్ జర్మైన్ స్టార్ నేమార్ ప్రత్యర్థి రెన్నేస్ జట్టుపై ఒక్క కూడా చేయలేదు. కానీ, స్టేడియంలోని ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3-1తేడాతో నేమార్ జట్టు గెలుపొందింది. అయితే మ్యాచ్‌లో ఆడినంతసేపు మాత్రం నేమార్ ఒక్కగోల్ కూడా చేయలేకపోయాడు. దానికి కారణం గేమ్ మొదటి నుంచి మైదానంలో ఉన్నా.. మధ్యలో అతని స్థానంలో యంగ్‌స్టర్ అయిన క్రిస్టోఫర్ కుంకు నేమార్‌ స్థానంలో దిగాల్సిందిగా సూచించింది.

ఏమైంది హసన్ అలీ.. పది వికెట్లు పడగొట్టావా?ఏమైంది హసన్ అలీ.. పది వికెట్లు పడగొట్టావా?

దీంతో నేమార్ స్థానంలో ఆ ప్లేయర్ మైదానంలో అడుగుపెట్టాడు. అలా నేమార్ ఒక్క గోల్ కూడా చేయకుండానే వెనుదిరిగాడు. లీగ్ 1 టోర్నీలో పీఎస్‌జీ విజయం దిశగానే దూసుకుపోతోంది. ఇదిలా ఉంచితే మ్యాచ్ ముగిసిన వెంటనే ఓ చిన్నారి అభిమాని నేమార్ వద్దకు దూసుకు వచ్చాడు. భద్రతా సిబ్బందిని దాటుకుని అతను నేమార్‌ను చేరుకోవడంతో అభిమానానికి స్పందించిన నేమార్ జెర్సీ ఇచ్చి పంపేశాడు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన నేమార్ 'అభిమానుల కోసం ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆ ఉద్దేశ్యంతోనే అతనికి జెర్సీ ఇచ్చేశాను. అతను చూపించిన అభిమానం ఎంత స్వచ్ఛంగా ఉందో మీరూ చూశారు కదా. ఆ బంధానికి నేను చాలా సంతోషిస్తాను. అదీ కాకుండా అంతటి అభిమానం చూపించింది ఏ మోసం తెలియని ఓ చిన్నారి కావడం మరింత ఆనందాన్ని తెచ్చిపెట్టింది' అని నేమార్ చెప్పుకొచ్చాడు.

ఇదే కాదు ఇప్పటికీ పలు సందర్భాల్లో నేమార్ తాను అభిమానుల కోసం ఏదో ఒకటి చేయాలని తపనపడుతుంటానని పలు సార్లు అభిప్రాయపడ్డాడు. వారు చూపించిన అభిమానాన్ని ఏదో ఒకలా తిరిగి ఇవ్వాలని ప్రయత్నిస్తుంటానని వివరించాడు. లీగ్ 1 టోర్నీ మొదలైన నాటి నుంచి ఆరు సార్లు విజేతగా నిలిచిన పీఎస్‌జీ పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో టాప్ స్థానంలో నిలిచింది. పీఎస్‌జీ గురువారం రీమ్స్ స్టేడియంలో తరువాయి మ్యాచ్ ఆడనుంది.

Story first published: Monday, September 24, 2018, 17:04 [IST]
Other articles published on Sep 24, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X