For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

భారత ఆర్మీకి సేవలు: పుట్‌బాల్ మ్యాచ్‌లో మెరిసిన ధోని (వీడియో)

MS Dhoni Plays Football With Actor Arjun Kapoor In Mumbai || Oneindia Telugu
Watch: MS Dhoni plays football with Bollywood star before joining Army duties

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి క్రికెట్‌తో పాటు పుట్‌బాల్ అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. ప్రాక్టీస్ మ్యాచ్ సమయంలో జట్టులోని సహచర ఆటగాళ్లతో చాలా సార్లు ధోని పుట్‌బాల్ ఆడటాన్ని మనం చూశాం. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోని రెండు నెలలు పాటు భారత ఆర్మీలో సేవలందించేందుకు సిద్దమయ్యాడు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

ఈ క్రమంలో ఆర్మీ విధుల్లోకి చేరడానికి ముందు మహేంద్ర సింగ్ ధోని ప్లేయింగ్ ఫర్ హ్యుమానిటీ అనే క్లబ్ ద్వారా తన మానవత్వాన్ని మరో సారి చాటుకున్నాడు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌లతో కలిసి ఓ ఛారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వెస్టిండిస్ పర్యటనకు అందుబాటులో లేకుండా రెండు నెలలు పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయాలని టీమిండియా మాజీ కెప్టెన్ ధోని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తన రెండు నెలల సైనిక శిక్షణను ధోని గత గురువారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

పారాచూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోని బుధవారం బెటాలియన్‌తో కలిసి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ బాధ్య‌త‌లు స్వీకరించాడు. జులై 31 నుంచి ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు 106 టెరిటోరియ‌ల్ ఆర్మీ బెటాలియ‌న్‌తో క‌లిసి ధోనీ ప‌నిచేయ‌నున్నాడు.

క‌శ్మీర్‌లో ఉన్న విక్ట‌ర్ ఫోర్స్‌తో ధోనీ క‌ల‌వ‌నున్నాడు. అక్కడ పారాచూట్ రెజిమెంట్‌తో శిక్షణ ప్రారంభిస్తాడు. సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి వచ్చాక ధోని పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్ డ్యూటీల‌ను ధోనీ నిర్వర్తించనున్నాడు. భారత ఆర్మీకి సేవలందించాలన్న ధోని నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Monday, July 29, 2019, 17:50 [IST]
Other articles published on Jul 29, 2019
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+