For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రత్యర్ధి జట్టుకు గిఫ్ట్‌గా ఇచ్చాడు: 90 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్ (వీడియో)

Watch: Goalkeeping Howlers Gift Opposition Two Goals From Halfway Line

హైదరాబాద్: ఏ ఆటలోనైనా తప్పిదాలు అనేవి సహజం. ఒకోసారి ఆ తప్పిదాల కారణంగా భారీ మూల్యం చెలించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జపాన్ జే లీగ్‌లో భాగంగా జరిగిన పుట్‌బాల్ మ్యాచ్‌లో ఎహిమా ఎఫ్‌సి గోల్ కీపర్ మసహిరో ఒకమోటో చేసిన తప్పిదానికి 90 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్ ప్రత్యర్ధి జట్టుకు సమర్పించుకున్నాడు.

మంగళవారం జపాన్‌ జే లీగ్‌లో భాగంగా ఎహిమా ఎఫ్‌సి-మాంటెడియో యమగట జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తొలి అర్ధభాగం ముగిసేసరికి మాంటెడియో యమగట జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో అర్ధభాగంలో ఎహిమా ఎఫ్‌సి మరింత దూకుడుగా ఆడసాగింది.

ఈ క్రమంలో ఎహిమా ఎఫ్‌సి ఆ జట్టు గోల్ కీపర్ గోల్ పోస్టుని వదిలి ముందుకు వచ్చాడు. అయితే, దీనిని సద్వినియోగం చేసుకున్న మాంటెడియో యమగట ఆటగాళ్లు షున్ నకామురా, టాట్సుహిరో సకామోటో కేవలం రెండు నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టారు. ఈ సీజన్ ఇటీవలే తెలుగులో విడుదలైన విజిల్‌ సినిమా క్లైమాక్స్‌ను తలపించింది.

ముందుగా మిడ్ ఫీల్డ్ నుంచి నేరుగా ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌పై దాడి చేసిన షున్ నకామురా గోల్‌ కొట్టాడు. ఆ సమయంలో గోల్‌కీపర్ అక్కడ లేకపోవడం విశేషం. అయితే, ఈ షాక్‌ నుంచి ప్రత్యర్థి జట్టు కోలుకునేలోపే మరో గోల్ కొట్టారు. ఇలా కేవలం 90 సెకన్ల వ్యవధిలో ఎవరూ ఊహించని విధంగా మరో గోల్ సాధించారు.

దీంతో గోల్‌ కీపర్‌ మసహిరో ఒకమోటోపై అభిమానులు మండిపడుతున్నారు.కేవలం 90 సెకన్ల వ్యవధిలో రెండు షాకింగ్‌ గోల్స్‌ సమర్పించుకోవడం ఏంటని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. విజిల్ సినిమా క్లైమాక్స్‌లో జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో హీరో విజయ్‌ జట్టు కూడా అచ్చం ఇలానే గోల్స్‌ చేసి విజయం సాధిస్తుంది.

Story first published: Wednesday, October 30, 2019, 12:09 [IST]
Other articles published on Oct 30, 2019
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+