హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒక ఛాలెంజ్ విసిరింది. పిఫా అండర్-17 పుట్‌బాల్ వరల్డ్ కప్‌కు భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పుట్ బాల్ జట్టుకి మద్దతు తెలిపుతూ #JuggleLikeAChamp అనే ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గతంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ తరహా మాదిరి ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన వ్యక్తి దానిని పూర్తి చేసి మరో వ్యక్తి పేరుని ప్రతిపాదించాలి. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఫుట్‌బాల్ ఆడిన పీవీ సింధు, సినీ నటుడు సోనూసూద్ పేరుని ప్రతిపాదించింది. కాగా, పీవీ సింధుకి భారత పుట్ బాల్ మాజీ కెప్టెన్ బైచింగ్ భూటియా ఈ ఛాలెంజ్‌ను విసిరాడు.
అక్టోబర్‌లో జరిగే పిఫా అండర్-17 పుట్ బాల్ వరల్డ్ కప్ భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పీవీ సింధు ఛాలెంజ్‌ని స్వీకరించిన సోనూసూద్... బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ పేరుని ప్రతిపాదించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్టు చేశాడు.
సోనూసూద్ విసిరిన ఛాలెంజ్‌ని షారుక్ స్వీకరిస్తాడో లేదో వేచి చూడాలి మరి. ఇదిలా ఉంటే గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన సింధు జీవితం ఆధారణంగా బయోపిక్ సినిమాని తీయనున్నట్లు ఇప్పటికే సోనూసూద్ ప్రకటించిన సంగతి తెలిసిందే.