Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వినీత్ స్పిరిట్‌తో చెన్నైపై గెలుపు: టాప్‌లోకి కేరళ

కోచి: ప్రస్తుత ఐఎస్ఎల్ సీజన్‌లో ఇప్పటివరకు అండర్ డాగ్స్‌గా వ్యవహరించిన కేరళ బ్లాక్ బస్టర్స్ చెలరేగిపోయారు. శనివారం సాయంత్రం తమ సొంతగడ్డ కోచిలో జరిగిన మ్యాచ్‌లో దుమ్మరేపారు. డిఫెండింగ్ చాంపియన్ చెన్నయిన్‌ను ముప్పుతిప్పలు పెట్టి 3 - 1 స్కోర్ తేడాతో కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టు విజయం సాధించింది.

53 వేల మందికి పైగా సొంత అభిమానుల మధ్య కోచిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన కేరళ కుర్రాడు సికె వినీత్ చివరి 5 నిమిషాల్లో చేసిన రెండు గోల్స్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. ఫస్టాఫ్‌లో బెర్నార్డ్ మెండీ గోల్ సాధించి చెన్నైయిన్‌కు లీడ్ సాధించినా ప్రయోజనం లేకపోయింది.

కానీ సూపర్ సబ్ డిడియర్ బోరిస్ కాడియో 66వ నిమిషంలో స్కోర్ సమం చేయడం.. తర్వాత సీకే వినీత్ గోల్స్‌తో మ్యాచ్ ఫలితం మారిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ పై విజయం సాధించడంతో 15 పాయింట్లతో కేరళ బ్లాక్ బస్టర్స్ పాయింట్ల టేబుల్ లో రెండో స్థానాన్ని ఆక్రమించింది.

లీగ్ దశలో చెన్నైయిన్ జట్టుపై కేరళ బ్లాక్ బస్టర్స్ విజయం సాధించడం ఐఎస్ఎల్ లో ఇదే మొదటిసారి. ఫస్టాఫ్ లో డిఫెండింగ్ చాంపియన్ కుర్రాళ్లు గోల్ చేసేందుకు తమకు వచ్చిన అవకాశాలను చేజేతులా వదిలి పెట్టారు.డిడియర్ కాడియా సబ్ స్ట్యూషన్ కూడా కేరళకు కలిసి వచ్చింది.

 కేరళపై ప్రారంభం నుంచే చెన్నై ఒత్తిడి

కేరళపై ప్రారంభం నుంచే చెన్నై ఒత్తిడి

చెన్నై సంచలనం జెజె లాల్పెఖులా ప్రత్యర్థి జట్టు కేరళ డిఫెన్స్ బలహీనంగా ఉండటాన్ని సానుకూలంగా మార్చుకుని రెండో నిమిషంలోనే షాట్ కొట్టి గోల్ పాయింట్ సాధించేందుకు ప్రయత్నించాడు. కానీ కేరళ గోల్ కీపర్ గ్రహం స్టాక్ స్థానిక ఫ్యాన్స్ మద్దతు కేరింతల మధ్య దిగ్విజయంగా తిప్పికొట్టగలిగాడు. మరో నాలుగు నిమిషాల తర్వాత రాఫెల్ అగస్టో పంపిన బంతి వైడ్‌గా మారి గోల్ పోస్ట్ దాటుకుని వెళ్లిపోయింది. విజిటర్స్.. కేరళపై ప్రారంభంలోనే ఒత్తిడి పెంచేందుకు పూనుకున్నారు. 22వ నిమిషంలో వింగ్ వద్ద ఉన్న బెర్నార్డ్ మెండిని గమనించిన రాఫెల్ అగస్టో బంతిని పంపాడు. కేరళ డిఫెన్స్‌ను చేధించి మరీ బంతిని మెండీ గోల్ పోస్ట్ దారి మళ్లించడంతో చెన్నైయిన్ ఒక పాయింట్ లీడ్ సాధించింది.

సెకండాఫ్‌లో గోల్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న కేరళ

సెకండాఫ్‌లో గోల్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న కేరళ

చెన్నై గోల్ కొట్టగానే స్టేడియం అంతా ఒక్కసారి మూగబోయింది. చెన్నైయిన్ మరో గోల్ చేసే అవకాశం ఫస్ట్ఆఫ్ ముగింపు దశలో వచ్చింది. బెర్నార్డ్ మెండీ పంపిన బంతిని లెఫ్ట్ లైన్‌కు బైలైన్ వద్ద ఉన్న దుదు గోల్ పోస్ట్ దారి పట్టించినా కీపర్ గ్రహంస్టాక్ మరోసారి అడ్డుపడ్డాడు. సెకండాఫ్‌లో కేరళకు మహ్మద్ రఫీఖ్ రూపంలో గోల్ చేసేందుకు అవకాశం లభించినా సాధ్యం కాలేదు. రఫీఖ్ ఫ్లిక్ చేసిన బంతిని సబ్ స్ట్యూట్ కాడియో సరైన రీతిలో పంపకపోవడంతో లక్ష్యాన్ని చేరుకోలేదు. హోస్ట్స్ స్కోర్ సమం చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. మ్యాచ్ ప్రారంభమైన గంట సేపటి తర్వాత సికె వినీత్ లెఫ్ట్ వైపు నుంచి పంపిన బంతిని డైవ్ ద్వారా డువాయ్నేకెర్ర్ కిక్ కొట్టినా గోల్ పోస్ట్ దరి చేరలేదు.

అనూహ్య రీతిలో వినీత్ రచించిన స్క్రిప్టు విజయవంతం

అనూహ్య రీతిలో వినీత్ రచించిన స్క్రిప్టు విజయవంతం

కానీ ఆ తర్వాత ఆరు నిమిషాలకు సబ్‌స్ట్యూట్స్‌గా వచ్చిన అంటోనియో జర్మన్, డిడియర్ కాడియో సొంత అభిమానుల కేరింతల మధ్య సంయుక్తంగా బంతిని స్వాధీనంచేసుకుని పర్ఫెక్ట్‌గా గోల్ పోస్ట్‌కు పంపి స్కోర్ సమంచేశారు. బైలైన్ వద్దనున్న జెర్మన్ పంపిన బంతిని ఎలి సాబియా స్వాధీనానికి ప్రయత్నిస్తుండగా దాన్ని స్క్వేరింగ్ ద్వారా కాడియోకు పంపడంతో బంతి గోల్ పోస్ట్ దారి పట్టింది. తర్వాత అనూహ్య రీతిలో వినీత్ రచించిన స్క్రిప్టు విజయవంతంగా అమలైంది. మ్యాచ్ చివరి పది నిమిషాల వ్యవధిలో కేరళ డిఫెన్స్ పై చెన్నైయిన్ విరుచుకుపడింది.

85వ నిమిషంలో కెర్ర్ విఫలం కావడం

85వ నిమిషంలో కెర్ర్ విఫలం కావడం

82వ నిమిషంలో కేరళ ప్లేయర్ దుదూ బ్యాక్ లైన్ వద్ద నుంచి షాట్ ద్వారా బంతిని గోల్ పోస్ట్ కు పంపేందుకు యత్నించాడు. కానీ సందేశ్ జిగ్నాస్ దాన్ని విజయవంతంగా నిలువరించాడు. 85వ నిమిషంలో జోస్ క్రాస్ చేసిన బంతిని అందుకోవడంలో కెర్ర్ విఫలం కావడంతో వినీత్ సిజర్స్ కిక్ తో నేరుగా బంతిని గోల్ పోస్ట్ కు పంపాడు. దీంతో చెన్నైయిన్ పై కేరళ 2 - 1 స్కోర్ ఆధిక్యం సాధించగలిగింది. మరో నాలుగు నిమిషాలకు జెర్మన్ పంపిన బంతిని మరోసారి వినీత్ తనదైన శైలిలో కిక్ కొట్టి బంతిని గోల్ గా మార్చడంతో కేరళ బ్లాక్ బస్టర్స్ కు అద్భుతమైన విజయం లభించింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+