Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

UEFA Champions League: నాపోలీ-బార్సిలోనా గేమ్ ‘టై’

యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్ లీగ్‌లో ఫస్ట్ లెగ్‌లో భాగంగా జరిగిన నాపోలీ-బార్సిలోనా మ్యాచ్ టైగా ముగిసింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇరు జట్లు 1-1‌తో స్కోరును సమం చేశాయి. గత డిసెంబర్ తర్వాత ఇటలీయన్ క్లబ్‌లో తిరిగొచ్చిన విక్టర్ ఒసిమ్హెన్ పోరాడి.. నాపోలీ జట్టును ఓటమి నుంచి తప్పించాడు. అతడు అద్భుత గోల్‌తో స్కోరు సమం అయ్యింది.

అఫ్రికా కప్ నేషన్స్‌లో ఒసిమ్హెన్ ప్రాతినిథ్యం వహించిన నైజీరియా రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత నాపోలీ కోసం బరిలోకి దిగుదామనుకున్న అతడు మునపటి గేమ్‌లో నిషేధానికి గురయ్యాడు. ఇవాళ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చిన ఒసిమ్హెన్ చివరి 15 నిమిషాల్లో గోల్ సాధించాడం విశేషం. పెనాల్టీ ఏరియాలో తనకి దొరికిన క్లియరెన్స్‌ను అతను చక్కవగా సద్వినియోగం చేసుకున్నాడు.

Victor Osimhen scored Napolis equaliser

అయితే గోల్ ఖాతాను తొలుత బార్సిలోనా తెరిచింది. రాబర్ట్ లెవాండోస్కీ తన 93వ ఛాంపియన్స్ లీగ్ గోల్‌తో బార్సిలోనాకు ఆధిక్యాన్ని తెచ్చిపెట్టాడు.

మరోవైపు మూడు నెలల బాధ్యతలు నిర్వర్తించిన ప్రధాన కోచ్ వాల్టర్ మజారీని తప్పించిన తర్వాత నాపోలీకి ఇదే మొదటి గేమ్. మజారీ స్థానంలో స్లోవేకియన్ ప్రాన్సిస్కో కాల్జోనాను నియమించారు.

అయితే పోర్టో వింగర్ గాలెనో అద్భుతమైన నిలుపుదలతో మెదటి లెగ్‌లో ఆర్సెనల్‌పై 1-0తో ఆధిపత్యం చెలాయించింది. ఎస్టాడియో డో డ్రాగావో వద్ద జరిగిన తీవ్ర పోరాటం తర్వాత అర్సెనల్ గోల్ చేసేలా కనిపించాడు. అదనపు సమయం నాలుగో నిమిషంలో బ్రెజిలియన్ గాలెనో బాక్స్ వెలుపల నుండి షాట్ కొట్టాడు. కానీ అది ఫలించలేదు.

2010 నుంచి లాస్ట్-8లో ఉండాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న గన్నర్స్ గోల్స్ సాధించడానికి మంచి అవకాశాలు వచ్చాయి. ఫస్ట్ హాఫ్‌లో క్లోజ్ రేంజ్ నుంచి గాలెనో ఓ గోల్‌కు ప్రయత్నించాడు. అలాగే కై హావర్ట్జ్ మొదటి అర్ధభాగంలో ఆర్సెనల్ కోసం ఉత్తమ రెండు అవకాశాలను పొందాడు. ఆరు గజాల దూరంలో కార్నర్ నుంచి హెడింగ్‌కు ట్రై చేశాడు. కానీ పక్కనుంచి బాల్ వెళ్లింది. కాగా, మార్చి 12న ఎమిరేట్స్ స్టేడియంలో రిటర్న్ లెగ్‌లో ఇరు జట్లు మరోసారి తలపడనున్నాయి.

Story first published: Thursday, February 22, 2024, 16:48 [IST]
Other articles published on Feb 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+