భూకంపంలో ఘోర విషాదం.. స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు బలి!
వెనిజులాలో సంభవించిన భారీ భూకంపం ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అర్జెంటీనా డిఫెండర్ లూకాస్ ట్రెజో భార్య, ఇద్దరు పిల్లల ఈ ప్రకృతి వైపరీత్యంలో ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని యారాకుయ్ ప్రాంతంలో సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాల కారణంగా వారు నివసిస్తున్న అపార్ట్‌మెంట్ భవనం కుప్పకూలిపోయింది. ట్రెజో భార్య యానినా మారనెల్లా, వారి పిల్లలు ఆరోన్, ఐన్హోవా ట్రెజోలు ఈ శిథిలాల కింద చిక్కుకుపోయారు. మొదట వారు కనిపించకుండా పోయినట్లు వార్తలు రాగా.. సహాయక చర్యల అనంతరం వారు మరణించినట్లు రెస్క్యూ బందాలు ధ్రువీకరించాయి.
భూకంపం జరిగిన సమయంలో లూకాస్ ట్రెజ్ తన క్లబ్ మారిటిమోతో కలిసి రాబోయ్ మ్యాచ్ కోసం సిద్ధమవడానికి కారకాస్ నగరంలో ఉన్నాడు. దీంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్న తీరప్రాంతమైన ప్లాయా గ్రాండేలోని ఓ నివాస భవనంలో అతని కుటుంబం ఉంది. భవనం కూలిపోయిన విషయం తెలియగానే.. ట్రెజో తన కుటుంబం కోసం స్థానిక స్వచ్ఛంద సేవకులు, రెస్క్యూ టీమ్‌ల సహాయంతో తీవ్రంగా గాలించాడు. అంతకుముందు అతను ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంగా స్పందిస్తూ.. "ప్లాయా గ్రాండేలోని మా భవనం కూలిపోయింది. నా కుటుంబం గురించి నాకు ఏ సమాచారం లేదు. దయచేసి వారి కోసం ప్రార్థించండి. వారు అక్కడ లేరనే నేను నమ్ముతున్నాను" అంటూ సమాచారం కోసం ప్రజలను అభ్యర్థించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది.

ఈ ఘోర ప్రమాదంపై డెపోర్టివో లా గ్వైరా క్లబ్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ సంతాపం ప్రకటించింది. "లూకాస్ ట్రెజో భార్య యానినా, పిల్లలు ఆరోన్, ఐన్హోవాల అకాల మరణం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ట్రెజో కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలి" అని పేర్కొంది. జూన్ 24న వెనిజులాలో సంభవించిన ఈ జంట భూకంపాల వల్ల దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది అదృశ్యమయ్యారు. ఈ విపత్తు కారణంగా సుమారు 67.6 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వలసల సంస్థ శనివారం విడుదల చేసిన నివేదికలో అంచనా వేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications