పరుగు ముగిసింది: పుట్‌బాల్ ప్లేయర్‌గా అలరించనున్న బోల్ట్
హైదరాబాద్: 2018లోగా ఫుట్‌బాల్ ఆటగాడిగా కెరీర్ ప్రారంభించనున్నట్లు జమైకా పరుగుల చిరుత, మాజీ స్ప్రింటర్ ఉసెన్ బోల్డ్ తెలిపాడు.' అవును.. నాకు ఫుట్‌బాల్ ఆడటం చాలా ఇష్టం. దీని గురించి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. కొన్ని ఫ్రాంచైజీ క్లబ్స్ కూడా నన్ను సంప్రదించాయి' అని బోల్ట్ తెలిపాడు.
గాయాల కారణంగా ఫిట్‌నెస్ లేదని, శిక్షణ కూడా సరిగా చేయలేకపోతున్నానని చెప్పాడు. అయినప్పటికీ, 2018లోగా ప్రొపెషనల్ పుట్‌బాల్ ఆడే అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నానంటూ బోల్ట్ చెప్పుకొచ్చాడు. మాంచెస్టర్ యునైటెడ్ సపోర్టర్ అయిన బోల్ట్ వచ్చే ఆగస్టు నుంచి పుట్‌బాల్ ఆడనున్నట్లు తెలిపాడు.

ఫుట్‌బాల్‌లో ఉత్తమ ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డోను ఉసెన్ బోల్ట్ ఎంచుకున్నాడు. లియోనల్ మెస్సీ, నేమార్‌లు కూడా తనకు ఇష్టమని, వాళ్లు బాగా ఆడతారని బోల్ట్ చెప్పాడు. అలాగే ఏ ఆటలోనైనా అత్యున్నత స్థాయికి చేరాలంటే మంచి క్రమశిక్షణ, ఆశయం, పట్టుదల, కష్టపడే తత్వం కావాలని బోల్ట్ చెప్పాడు.
కాగా, అథ్లెటిక్స్ కెరీర్‌కు వీడ్కోలు పలికే సమయానికి ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్‌గా బోల్ట్ ఉన్నాడు. తన కెరీర్‌లో 8 ఒలింపిక్ బంగారు పతకాలతో పాటు 11 వరల్డ్ ఛాంపియన్‌షిప్ పతకాలను ఉసేన్ బోల్ట్ సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications