Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పూర్తిస్థాయి పుట్‌బాల్ ఆటగాడిగా ఉసేన్ బోల్ట్ (వీడియో)

Usain Bolt lives football dream with Borussia Dortmund

హైదరాబాద్: జమైకా చిరుత, స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ పూర్తిస్థాయి ఫుట్‌బాల్‌ ఆటగాడిగా మారాడు. ప్రత్యర్థులకు అందనంత వేగంలోనే కాదు ఫుట్‌బాల్‌లోనూ మెరుపులు మెరిపించగలనని చేసి చూపాడు. నెక్స్ట్‌జర్నీ హాష్‌ట్యాగ్‌తో బోల్ట్‌ చేసిన ట్వీట్‌ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తాజాగా బోర్సియా డార్ట్‌మండ్ సాకర్ క్లబ్ ఆటగాళ్లతో కలిసి శుక్రవారం ప్రాక్టీస్ పాల్గొన్నాడు. మారియో గోట్జె, జులియన్ వేల్ లాంటి ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్‌లో అదరగొట్టాడు. దాదాపు 1500 ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు హాజరైన ప్రాక్టీస్ సెషన్‌లో బోల్ట్ తన సాకర్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.

పుట్‌బాల్ అనుభవం ఉన్న ఆటగాడిలా రెండు గోల్స్‌ చేసి సహచరులను, అభిమానులను ఆశ్చర్యపరిచాడు. పెనాల్టీ కిక్‌, హెడర్‌ ద్వారా గోల్‌ చేసి ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు షాకిచ్చాడు. తన ప్రదర్శన చూసి డార్ట్‌మండ్‌ టీమ్‌ క్లబ్‌ తనతో కాంట్రాక్ట్‌ చేసుకుంటుందోమో అంటూ మ్యాచ్ అనంతరం బోల్ట్‌ సరాదాగా వ్యాఖ్యానించాడు.

మ్యాచ్‌ అయిపోగానే అభిమానులతో పాటు, ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు కూడా బోల్ట్‌ ఆటోగ్రాఫ్‌ కోసం పోటీపడ్డారు. తన అధికారిక స్పాన్సర్‌గా వ్యహరిస్తున్న'పూమా'తో గత జనవరిలో కుదిరిన అంగీకారం మేరకు డార్ట్‌మండ్ క్లబ్ ఆటగాళ్లతో కలిసి బోల్ట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.

జూన్‌లో జరిగే మరో చారిటీ మ్యాచ్‌లో కూడా బోల్ట్‌ పాల్గొననున్నాడు. ఎనిమిది ఒలంపిక్‌ స్వర్ణ పతకాలు సాధించిన బోల్ట్‌ గతేడాది లండన్ వేదికగా జరిగిన వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, March 24, 2018, 15:59 [IST]
Other articles published on Mar 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+