
ఫిఫా వరల్డ్ కప్‌లో ఇరాన్ ఆట ముగిసింది. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ 1-0 తేడాతో ఓడింది. ఈ ఓటమితో ఫిఫా వరల్డ్ కప్ 2022 నుంచి ఇరాన్ నిష్క్రమించింది. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి దూకుడుగా ఆడిన యూఎస్ఏ జట్టుకు తొలి హాఫ్‌లోనే గోల్ చేసే అవకాశం దక్కింది. క్రిస్టియన్ పులిసిక్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గోల్ పూర్తి చేశాడు.
మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఇరాన్ జట్టు కొంత ఆత్మరక్షణలో కనిపించింది. అదే సమయంలో యూఎస్ఏ జట్టు దూకుడుగా ఆడింది. ఈ క్రమంలోనే ఆ జట్టు గోల్స్ చేసేందుకు చాలా ప్రయత్నించింది. కానీ దురదృష్టవశాత్తూ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఇలాంటి సమయంలో అద్భుతమైన టీం ప్లేతో 38వ నిమిషంలో మరో చక్కని అవకాశం వచ్చింది.
దీన్ని సద్వినియోగం చేసుకున్ పులిసిక్ గోల్ పూర్తి చేశాడు. ఈ స్కోరు సమం చేసేందుకు ఇరాన్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో ఆధిక్యం పెంచుకోవడంలో యూఎస్ఏ జట్టు ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దీంతో తొలి హాఫ్‌ను 1-0 ఆధిక్యంలోనే యూఎస్ఏ ముగించింది.
రెండో హాఫ్‌లో సరైన అవకాశం చూసి గోల్ చేయాలని ఇరాన్ ప్రయత్నించింది. కానీ ఆ అవకాశం ఆ జట్టుకు రాలేదు. యూఎస్ఏ కూడా మరో గోల్ చేయడానికి విశ్వప్రయత్నం చేసినా ఫలితం మాత్రం కనిపించలేదు. అయితే తొలి హాఫ్‌లో చేసిన గోల్ కారణంగా ఈ మ్యాచ్‌ను యూఎస్ఏ తన ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమితో ఇరాన్ ఇంటి దారి పట్టింది.
ఈ గ్రూప్ నుంచి యూఎస్ఏ కూడా నాకౌట్ చేరింది. తన తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడేందుకు ఈ జట్టు సిద్ధం అవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరాన్ ఆటగాళ్లను ఆ దేశ ప్రభుత్వమే బెదిరించిన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురి చేస్తామని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరికలు చేసినట్లు వార్తలు వచ్చాయి.