Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: ఆస్ట్రేలియాపై ఘన విజయం.. నాకౌట్‌కు అగ్రరాజ్యం అమెరికా

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో అగ్రరాజ్యం అమెరికా జోరు కొనసాగుతోంది. గ్రూప్-డి లో భాగంగా సీయాటిల్ స్టేడియంలో శనివారం తెల్లవారుజామున జరిగిన హోరాహోరీ పోరులో అమెరికా 2-0 తేడాతో ఆస్ట్రేలియా‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో గ్రూప్-డీ‌లో అగ్రస్థానంలో నిలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నాకౌట్‌కు అర్హత సాధించింది.ఆతిథ్య మెక్సికో తర్వాత ఈ టోర్నీలో నాకౌట్ చేరిన రెండో జట్టుగా నిలిచింది.

96 ఏళ్ల ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అమెరికా వరుసగా రెండు లీగ్ మ్యాచ్‌లు గెలవడం ఇదే రెండోసారి మాత్రమే. అరంగేట్ర ఫిపా ప్రపంచకప్(1930)లో బెల్జియం, పరాగ్వేలపై అమెరికా విజయం సాధించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత (తొలి మ్యాచ్‌లో పరాగ్వేపై 4-1, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 2-0) బ్యాక్-టు-బ్యాక్ విజయాలు నమోదు చేసింది. స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ పులిసిచ్ గాయంతో దూరమైనప్పటికీ అమెరికా అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాను ఓడించింది.

సెల్ఫ్ గోల్‌తో

మ్యాచ్ ప్రారంభమైన 40వ సెకనులోనే ఆస్ట్రేలియా ప్లేయర్ మహ్మద్ టూరే గోల్ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆ తర్వాత పుంజుకున్న అమెరికా 11వ నిమిషంలోనే ఖాతా తెరిచింది. ఫోలారిన్ బాలోగన్ పంపిన లో-క్రాస్‌ను అడ్డుకునే క్రమంలో ఆస్ట్రేలియా డిఫెండర్ కామెరాన్ బర్గెస్ 'సెల్ఫ్ గోల్' చేయడంతో అమెరికాకు 1-0 ఆధిక్యం లభించింది. అనంతరం ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ లెక్కి చేసిన గోల్ ప్రయత్నం తృటిలో చేజారింది.

USA Blank Australia 2-0 to Secure 2026 World Cup Knockout Berth and Historic Milestone

ఫస్టాఫ్ ముగియడానికి సరిగ్గా రెండు నిమిషాలు ఉందనగా.. (43వ నిమిషంలో)సెర్గినియో డెస్ట్ కొట్టిన షాట్ గాల్లోకి లేవగా, దానిని అలెక్స్ ఫ్రీమాన్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచాడు. మొదట దీనిని ఆఫ్‌సైడ్‌గా భావించినప్పటికీ, వీఏఆర్ (VAR) సమీక్ష తర్వాత గోల్‌గా ప్రకటించడంతో అమెరికా 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్ళింది. 1994 తర్వాత ప్రపంచకప్‌లో అమెరికా తరఫున ఒక డిఫెండర్ గోల్ చేయడం ఇది రెండోసారి మాత్రమే.

ఆస్ట్రేలియా పోరాడినా..

సెకండాఫ్‌లో ఆస్ట్రేలియా సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు క్రిస్టియన్ వోల్పాటో, కానర్ మెట్‌కాఫ్ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా అమెరికా డిఫెన్స్ లైన్‌ను దాటలేకపోయారు. చివరి నిమిషాల్లో ఆస్ట్రేలియా పట్టుదలగా ఆడినప్పటికీ గోల్స్ నమోదు చేయడంలో విఫలమైంది.

ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్ చేసిన అమెరికా జూన్ 25న లాస్ ఏంజిల్స్‌లో టర్కీతో తన తదుపరి మ్యాచ్ ఆడనుంది. మరోవైపు, ఆస్ట్రేలియా తన నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే పరాగ్వేపై తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

వరల్డ్ కప్ మోస్ట్ గ్లామరస్ ఫ్యాన్.. ఈమె ఎవరో తెలుసా?

వరల్డ్ కప్ మోస్ట్ గ్లామరస్ ఫ్యాన్.. ఈమె ఎవరో తెలుసా?
Story first published: Saturday, June 20, 2026, 9:26 [IST]
Other articles published on Jun 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+